ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు ఒక్కసారి అందుకోవడమే గంగనం. అలాంటిది రెండు సార్లు ఆస్కార్ అవార్డు అందుకోవడం చాలా కష్టం. అందులోను ఓ మహిళా, అందులోను ఓ ఇండియన్. ఇప్పటివరకు ఇండియాకు వచ్చిన ఆస్కార్ అవార్డు చాలా తక్కువ. వేల్లమీద లెక్కపెట్టవచ్చు. అందులోను ఒకే మహిళకు రెండు ఆస్కార్ అవార్డు రావడం ఒక రికార్డ్. అది ఎవరో కాదు. మన దేశ వీరవనిత గునీత్ మాంగా. మహిళా నిర్మాతగా ఆమె ఓ సంచలనం.
ఆమె రెండు సార్లు ఈ పురస్కారం పొందారు. “పీరియడ్ : ఎండ్ అఫ్ సెంటెన్స్” అనే డాక్యుమెంటరీ కి 2019లో మొదటిసారి ఈ ఆస్కార్ అవార్డు దక్కింది. ఆమె వల్ల మన దేశం గర్వంతో పులకించింది.
ఈ ఏడాది రెండోసారి “ది ఎలిఫెంట్ విస్పరర్స్” డాక్యుమెంటరీకి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ క్యాటగిరిలో మరోసారి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కారం లభించింది. అయితే ఈ విషయం చాలా మంది జర్నలిస్ట్ లకు తెలియక ఈ విషయం చెప్పలేదు. కానీ రెండు ఆస్కార్ అవార్డు లు సాధించిన ఇండియన్ మహిళగా ఆమె ఆస్కార్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. శాభాష్ గునీత్ మాంగా.