నాగర్ కర్నూల్ లోని నల్లమల అడవులలో ఉన్న ‘సలేశ్వరం లింగం’ పుణ్య క్షేత్రం గురించి కేవలం శివ భక్తులకు మాత్రమే తెలుసు. ఆరో శతాబ్దంలో ఈ పుణ్య క్షేతం గురించి పురానాలల్లో రాసుంది. ఈ గుడికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే అంశాలు ఇవి.
1. నల్లమల అడవులలో కృరమృగాలు విపరీతంగా ఉంటాయి. ముఖ్యంగా పులులు, సింహాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఏడాదిలో కేవలం మూడు రోజులు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. అది కూడా చైత్ర పౌర్ణమి రోజు మాత్రమే తెరుస్తారు. మూడో రోజుల తరువాత మూసేస్తారు.
2. ఈ ఆలయంలో చెంచులు మాత్రమే పూజలు చేస్తారు.
౩. ఈ ఆలయానికి శ్రీశైలం – హైదరాబాద్ హైవే మీదుగా వెళ్ళాలి. ప్రధాన రహదారి నుంచి నల్లమల అడవులలోకి వెళ్లే దారిలో 35 కిలో మీటర్లల్లో ఆలయం ఉంటుంది. అయితే ౩౦ కిలో మీటర్లు వాహనాల్లో వెళ్ళడానికి దారి ఉంటుంది. కానీ 5 కిలో మీటర్లు దారిలేదు. కాలినడకన వెళ్ళాలి. అన్ని లోయలు, జలపాతలతో ఉంటుంది. రాళ్ళు – రప్పలు దాటుకుంటూ ఆలయాన్ని వెతుకుతుంటు వెళ్ళాలి. అక్కడ ఒకప్పుడు చెంచులు ఉండేవాళ్ళు. మావోయిస్ట్ ల ప్రభావం వల్ల ఇప్పుడు వాళ్ళు కూడా కరువయ్యారు.
4. వన్య ప్రాణులతో నిండిన ఈ ప్రాంతం ఆ మూడు రోజులు మాత్రం గుడికి దరిదాపుల్లో ఉండవు. మనుషుల మీద దాడులు చేయవు. అవి మనుషులకు దారి వదులుతూ చాలా దూరం వెళ్ళిపోతాయి. ఎలాంటి హాని తలపెట్టావు. అయితే మిగతా రోజులల్లో వెళ్ళితే మాత్రం తిరిగి రావడం దాదాపు అసాద్యం.
5. కైలాసగిరిని చూడలేని వాళ్ళు ఈ సలేశ్వరం లింగం చూసినా జన్మ ధన్యం అవుతుంది అని శివ భక్తులు భావిస్తారు. అయితే కేవలం శివుడిని కులదైవంగా ఆరాదించే వాళ్ళు మాత్రమే రావాలి. సర్వ దేవుళ్ళను పూజించే వాళ్ళు రాకూడదు.
6. ఈ గుడిని కేవలం దళితులూ, ఆదివాసీలు, సంచార జాతులు, అడవి బిడ్డలు మాత్రమే సందర్శించు కుంటారు. ఇక్కడి జలపాతంలో తడిస్తే ఏడాది పొడవున చేసిన పాపాలు కొట్టుకు పోతాయి అని భక్తుల నమ్మకం.