రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్, హర్యానా రైతులను ఆదుకుంటామని తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 709 రైతు కుటుంబాలకు 1010 చెక్కులను మే లో పంపిణీ చేయగా ఆ చెక్కులు చెల్లడం లేదంటూ తాజాగా సమాచారం బయటకు వచ్చింది. దీంతో చెల్లని చెక్కులను ఇస్తావా దొరా అంటూ కేసీఆర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో ఈ విషయంపై దృష్టి సారించిన ప్రభుత్వం విచారణ జరిపింది.
Also Read : కోదండరామా ఏంటి రాజకీయం..!
1010చెక్కులను పంపిణీ చేశామని, అందులో 814చెక్కులకు నగదు చెల్లింపులు కూడా కంప్లీట్ అయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా చెక్కుల చెల్లింపులు ఆగిపోవడానికి ప్రభుత్వం కారణం కాదని చెప్పింది. నిబంధనల ప్రకారం చెక్కులను ఇచ్చిన మూడు నెలల లోపు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కాలపరిమితి ముగిసాక డిపాజిట్ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని..అలా చేయడం వలనే నగదు చెల్లింపులు నిలిచిపోయాయని ప్రభుత్వం ప్రకటించింది.
Also Read : రేవంత్ పాదయాత్రకు సీనియర్ల అడ్డుపుల్లలు
పెండింగ్ లోనున్న చెక్కులకు కూడా నగదు చెల్లింపులు చేయాలని ఆయా బ్యాంకులను ఆదేశించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఈ విషయానికి సంబంధించి మరింత సహాయం కోసం ప్రభుత్వ అదనపు కార్యదర్శి రాంసింగ్ ను సంప్రదించాలని సూచించారు. చెక్కులను పరిమిత కాలంలో డ్రా చేసుకోకుండా.. గడువు ముగిసాక డిపాజిట్ చేసుకొని సర్కార్ ను నిందించడం సమజంసం కాదని చెప్పుకొచ్చారు.