రాంగ్ రూట్ లో నడుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ను సెట్ రైట్ చేస్తున్నారు కేపీసీసీ అద్యక్షుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్. టి. కాంగ్రెస్ ను శక్తివంతంగా మార్చడంపై ఆయన ఫోకస్ పెట్టారు. కర్ణాటకలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కాంగ్రెస్ ను ఎలాగైతే అధికారంలోకి తీసుకోచ్చారో అలాగే తెలంగాణ కాంగ్రెస్ ను పవర్ లోకి తీసుకువచ్చేలా సేవలు అందించాలని డీకే డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ ను ఓడించేది కాంగ్రెస్సే అనే అభిప్రాయాన్ని ముందుగా ప్రజల్లో కలగజేయాలని తద్వారా కాంగ్రెస్ రేసులోకి వస్తుందనేది ఆయన భవన.
టీపీసీసీ చీఫ్ రేవంత్ కు అత్యంత సన్నిహితుడు డీకే శివకుమార్. కర్ణాటక వ్యూహాలు తెలంగాణలోనూ మేలు చేస్తాయని భావిస్తోన్న రేవంత్… డీకే సేవలను తెలంగాణలోనూ వినియోగించుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ కూడా డీకే సామర్ధ్యంపై పూర్తి విశ్వాసంతో ఉంది. ఆల్రెడీ డీకే శివ కుమార్ వర్క్ స్టార్ట్ చేశారని… పార్టీలో చేరికల వెనక ఆయన వ్యూహాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత భారీగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కలిసివచ్చే పార్టీలతో ముందుకు సాగాలని డీకే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
ఇందుకోసం బెంగళూర్ నుంచే డీకే వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. అందుకే కొత్తగా పార్టీలో చేరాలనుకునేవారు ముందుగా డీకేను కలుస్తున్నారని చెబుతున్నారు. తనను కలిసే నేతలకు డీకే ఒకట మాట చెబుతున్నారట. ముందుగా పార్టీని అధికారంలోకి తీసుకురావడంపై దృష్టిపెట్టండి. ఆ తరువాత పదవుల సంగతి తేల్చుకోండని సూచిస్తున్నారట. అందుకు నేతలంతా ఒకే చెప్తున్నారు. డీకే ప్రణాళికలు ఫలించడంతోనే చాలామంది నేతలు కూడా ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకుంటున్నారు తప్పితే పార్టీకి చేటు తెచ్చేలా మాట్లాడటం లేదు.
Also Read : తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు…!రాహుల్ ధైర్యం వెనుక ఉన్న ధీమా ఏంటి ?