తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈటల బీజేపీలో చేరిన తరువాత బండి సంజయ్ వ్యతిరేకులంతా ఆయన చెంతకు చేరారు. బీజేపీ సీఎం క్యాండిడేట్ ఈటలే అని ఆయన వర్గం ఫుల్ ప్రచారం చేసుకుంటోంది. అదే సమయంలో బండి సంజయ్ వర్గం కూడా బండికి మైలేజ్ ఇచ్చే విధంగా ప్రమోషన్స్ చేస్తోంది. మరోవైపు రెండు పేరు మోసిన పేపర్లు తమ నేతల కోసం పోటాపోటీగా కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రతి విషయాన్ని తమ నేతకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంతకీ ఆ పేపర్లు ఎవనేగా మీ సందేహం. వెలుగు , దిశా పేపర్ లు.
“కేంద్ర మంత్రివర్గంలోకి రాష్ట్రం నుంచి మరొకరు” అని శుక్రవారం వెలుగు పేపర్ కథనం ప్రచురించింది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రాసుకొచ్చింది వెలుగు. వచ్చే నెలలో బండి సంజయ్ రాష్ట్ర అద్యక్ష పదవి కాలం ముగియనుండటంతో ఆయన్ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని పరోక్షంగా ప్రస్తావించింది. ఈ లెక్కన..బండి సంజయ్ ని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకొని అద్యక్ష బాధ్యతలను ఈటల రాజేందర్ కు అప్పగిస్తారనే విధంగా ఆ కథనం ఉంది. ఈ పత్రిక అధినేతకు బండి సంజయ్ కి మధ్య గ్యాప్ ఉన్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. అందుకే ఆయన ఈటలకు ప్రమోషన్ వచ్చే విధంగా తన పత్రికలో కథనాలు ప్రచురితం చేయిస్తున్నారన్న వాదనలు బీజేపీ వర్గాల నుంచే వస్తున్నాయి.
ఇక, ఈ కథనం ప్రచురితం ఐన మరుసటి రోజే బండి సంజయ్ కనుసన్నలో నడుస్తోన్న దిశ.. వెంటనే రంగంలోకి దిగింది. బండి సంజయ్ ను అద్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారనే ప్రచారంపై ఆ పార్టీ అగ్రనాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రాసుకొచ్చింది. ఆ పార్టీ నేతలెవరూ ఈ వార్తకు సంబంధించిన లీకులు ఇవ్వలేదు. వెలుగు పేపరే ఈ వార్తను రాసుకొచ్చింది. దీంతో దిశా కథనం వెలుగు పేపర్ కు కౌంటర్ అన్నది స్పష్టం అవుతున్నది. ఎందుకంటే.. కేంద్రమంత్రి వర్గంలోకి మరొకరు అని కథనం ప్రచురితం చేసి..ఈటలకు అద్యక్ష బాధ్యతలు దక్కోచ్చు అని పరోక్షంగా రాసుకొచ్చి ఈ ప్రచారానికి ఊతమిచ్చింది వెలుగు పేపరే. కాబట్టి.. బండి సంజయ్ పేపర్ ఈటల బ్యాచ్ కథనాన్నికి కౌంటర్ ఎసేసింది.
రెండు పేరు మోసిన పత్రికలు తమ, తమ నేతల కోసం ఇలా కౌంటర్, ఎన్ కౌంటర్ వార్తలు రాసుకోవడం ఆ పత్రిక విలువలు మంటగలుపుతాయని చెప్పొచ్చు.