దిశ పేపర్ బరితెగించి బీజేపీకి ఉంపుడుగత్తె పాత్ర పోషిస్తోంది. తెలంగాణలో బీజేపీకి మైలేజ్ తీసుకొచ్చేందుకు వ్యూహకర్త పాత్రలో కథనాలు ప్రచురిస్తోంది. ఆ పార్టీ నేతల కన్నా దిశ పేపరే ఎక్కువగా శ్రమిస్తోంది. ఏమాత్రం అనుమానం రాకుండా బీజేపీ వంత పాడుతోంది. అర్బన్ ప్రాంతాల్లో మినహా రూరల్ ప్రాంతాల్లో ఏమాత్రం బలం లేని బీజేపీకి దిశ వార్తలు బలం టానిక్ లా పని చేస్తున్నాయి.
బీజేపీ తెలంగాణలో బలపడుతుందని చెప్పేందుకు దిశ ఎంచుకున్న మార్గం కాంగ్రెస్ ను బలహీనపరచడం. ఇందుకోసం రేవంత్ నాయకత్వంపై నిత్యం బురదజల్లడమే ఎజెండాగా పెట్టుకొని పతాక శీర్షికన ప్రచురిస్తోంది. తాజాగా.. రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ వార్త అన్ని ప్రధాన పత్రికలు హైలెట్ చేశాయి. కాని దిక్కుమాలిన దిశకు అదెంతమాత్రం పెద్ద న్యూస్ అనిపించలేదు. ఆ వార్తను హైలెట్ చేసి రాస్తే…కాంగ్రెస్ బలపడుతుంది. క్యాడర్ లో నూతనోత్తేజం నిండుతుంది. ఇదే దిశ బుగులు. అందుకే ఇంత ప్రధానమైన న్యూస్ ను చిన్న వార్తగా మలిచి.. కాంగ్రెస్ 50సీట్లపై ఫోకస్ చేసిందని రాసుకొచ్చింది.
తెలంగాణాలో ఏ పార్టీ అయిన అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు. అధికారం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చెబుతూ యాభై సీట్లపైనే ఆ పార్టీ ఎక్కువ ఫోకస్ చేస్తోందని పేర్కొంది. ఇందులో పెద్దగా దిశను తప్పుబట్టాల్సిన అవసరం లేదు కదా అనే ఆలోచన రావొచ్చు. ఇదే దిశ ఇటీవల బీజేపీ 90స్థానాలపై ఫోకస్ చేస్తోందని రాసుకొచ్చింది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీ 90స్థానాలపై ఫుల్ ఫోకస్ చేస్తుందట.చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేని బీజేపీ.. 90స్థానాల్లో ఫోకస్ చేస్తుందట. ఇలా రాయడం దిశకు సబబుగా ఎలా అనిపించిందో.
అందులోనూ 6% ఓటు బ్యాంక్ ఉండి.. 110 సీట్లలో డిపాజిట్ కోల్పోయిన పార్టీ 90 సీట్లపై ఫోకస్ చేస్తే..30% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ 50 సీట్లపై మాత్రమే ఫోకస్ చేస్తుందని దిశ రాసుకోచ్చింది. అంటే ఈ లెక్కన… దిశ ఎవరికి ఉంపుడుగత్తె పాత్ర పోషిస్తుందో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు.
Also Read : “దిశ” అవాస్తవాల పుట్ట – వాస్తవాలను రాస్తే ఆ ఉలిక్కిపాటు ఎందుకు..?