దిశ పేపర్ బీజేపీ అనుకూల పత్రిక అన్నది ఓపెన్ సీక్రెట్. మొదట్లో స్వతంత్రంగా వ్యవహరించిన ఆ తరువాత బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. ఎందుకు మారిపోయిందన్నది వేరే కథ. ఇటీవల ఆ పత్రికపై విమర్శలు వస్తే తాము స్వతంత్రంగానే ఉన్నామని ప్రకటించుకుంది. ప్రజా సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపిస్తే బీజేపీకి అనుకూలామా అంటూ విమర్శలపై కౌంటర్ రాసుకొచ్చింది. ప్రభుత్వ తప్పులను ప్రచురిస్తే అందులో తప్పే లేదు. అది పత్రిక బాధ్యత. కానీ ఆ పేపర్ మెయిన్ ఎడిషన్ కొన్నాళ్ళుగా ఎవరి వార్తలతో నిండిఉంటుంది..? ఏ పార్టీకి ప్రాధాన్యత ఇస్తుందన్నది డైలీ పేపర్ చదివే పత్రిక పాఠకులను అడిగిగితే సరి.
బీజేపీకి జాకీలు పెట్టేందుకు దిశా పెద్దఎత్తున కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీకి అనధికారిక వ్యూహకర్త పాత్ర పోషిస్తోంది. జనాలను కన్ఫ్యూజ్ చేసి..బీజేపీకి బలం పెంచే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ హవా తెలంగాణలో కొనసాగించేందుకు ఆ పార్టీ నేతలే కంటే దిశా పేపరే ఎక్కువ కష్టపడుతోంది. జనాల్లో బీజేపీపై ఎక్కువ చర్చ జరిగేలా చేయడం ఆ పేపర్ మొదటి కర్తవ్యం. కాబట్టి.. బీజేపీని జనాల్లోకి తీసుకేళ్ళెందుకు కొత్త చర్చకు తెరలేపింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ నుంచి పోటీ చేసే అంశాన్ని ఆ పార్టీ పరిశీలిస్తోందని రాసుకొచ్చింది.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పాలమూరు నుంచి మోడీ పోటీ చేసే అవకాశం ఉందని అందమైన అక్షరాలను ప్రయోగిస్తూ రాసుకొచ్చింది. అదే సమయంలో జనాల్లో ఈ వార్తపై నమ్మకం కల్గించేందుకు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు పరిశీలనలో ఉన్నాయని.. ప్రాథమిక సర్వే కూడా కంప్లీట్ అయిందని పేర్కొంది. నిజానికి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రధాని పోటీ చేసే ఆలోచనలో లేరు. ఈ అంశంపై పార్టీలో చర్చే జరగలేదు. కాని బీజేపీపై జనాల్లో చర్చ జరిగి.. ఆ పార్టీకి మైలేజ్ తీసుకురావాలనేది దిశా ఎత్తుగడ. ఇందుకోసం ఈ తప్పుడు వార్తలు రాసుకొస్తు పార్టీకి కొమ్ముకాస్తోంది.
గతంలోనూ ఇలాంటి నిరాదర వార్తలే రాసుకొచ్చింది దిశా. కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేసే అవకాశం లేదని.. ఆలేరు నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని ఇదే దిశ పీపర్ రాసుకొచ్చింది. ఇది కూడా నిరాధర వార్తే. ఇలాంటి వార్తలను ప్రచురిస్తూ బీజేపీకి మేలు చేయాలనీ అనుకుంటోంది దిశ. పైగా.. తాము స్వతంత్రంగానే సాగుతామని గంభీరమైన ప్రకటనలు చేయడం పాఠకులకు నవ్వు తెప్పించడంతోపాటు కోపం తెప్పిస్తోంది. Towards truth అని ట్యాగ్ లైన్ తో సాగుతున్న దిశా ఇలాంటి దిక్కుమాలిన అసత్య వార్తలను ప్రచురించడం ఎప్పుడు మానుతుందో..!