టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ,కళాతపస్వి కె. విశ్వనాథ్ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమాకు కొత్త వన్నె తీసుకొచ్చారు.
గుంటూరు జిల్లా రేపల్లె మండంలోని పెద పులివర్రు గ్రామం కె.విశ్వనాథ్ స్వస్థలం. 1930 ఫిబ్రవరి 19న శ్రీ కాశీనాధుని సుబ్రహ్మణ్యం, శ్రీమతి సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. చెన్నైలోని ఒక స్టూడియో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తరువాత ఆత్మగౌరవం సినిమా ద్వారా దర్శకుడిగా మారారు.
శంకరాభరణం, సాగరసంగమం, శృతి లయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి ఎన్నో చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు. నటుడిగా కూడా ఎన్నో సినిమాలో చేశారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషికి 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అనారోగ్యంతో ఆయన మరణించడంతోచిత్ర పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది.