మనకు ఏ నొప్పి వచ్చినా ముందుగా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుని ఉపశమనం పొందుతాము. దానితో నొప్పి తగ్గుతుంది అని మురిసిపోతము. కానీ ఆ పెయిన్ కిల్లర్ ఆ రోగాన్ని తగ్గించదు అని మీకు తెలుసా? ఉదాహణకు మీకు మోకాలు నొప్పి వచ్చిందే అనుకొందో. మీరు పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఆ నొప్పి కొన్ని గంటలపాటు తగ్గుతుంది. అంటే మోకాలు నొప్పి తగ్గింది అని మురిసిపోతారు. ఇది తప్పు. మోకాలు నొప్పి అస్సలు తగ్గదు. ఆ నొప్పిని తెలియజేసే మెదడు నరాల మీద ఆ పెయిన్ కిల్లర్ పనిచేస్తుంది. మెదడు నరాలు తాత్కాలికంగా మోద్దుబారేలా చేస్తాయి.
మీరు ఏ పెయిన్ కిల్లర్ వాడినా అది మెదడు మీదే ప్రభావం చూపుతుంది అని తెలుసుకోండి. కానీ అసలు రోగాన్ని ఎప్పటికీ తగ్గించదు. దానికి మందులు వేరుగా ఉంటాయి. తీర్థం వేరు – ప్రసాదం వేరు.
అసలు నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా? మన శరీరంలో ఒక భాగంలో సమస్య వచ్చినప్పుడు దానిని ముందుజాగ్రత్తగా హెచ్చరించడం. అంటే మనం రోడ్డు మీద ప్రయాణిస్తుంటే రెడ్ సిగ్నల్ లాంటిది. ట్రాఫిక్ జామయ్యింది అని హెచ్చరించడం. ఆ రెడ్ సిగ్నల్ని ఆర్పేసినంత మాత్రానా ట్రాఫిక్ తగ్గదుగా? పెయిన్ కిల్లర్తో ఆ నొప్పిని తగ్గించు కున్నంత మాత్రాన అసలు రోగం తగ్గదుగా?
మనకు తలనొప్పి వచ్చింది అంటే, మీరు ఓవర్ గా సినిమా లేదా టివి చూశారు అని అర్థం. మీరు ఓవర్ గా ఆలోచిస్తున్నారు అని అర్థం. మీరు ఓవర్ గా మాట్లాడుతున్నారు (సెల్ ఫోన్ లో కూడా కావచ్చు) అని అర్థం. మీరు ఓవర్ గా హెడ్ సెట్ ద్వార పాటలు వింటున్నారు అని అర్థం. దానికి పరిష్కారం పెయిన్ కిల్లర్ కాదు. మీరు వెంటనే కళ్ళు ముసుని విశ్రాంతి తీసుకోవాలి అని అర్థం.
పెయిన్ కిల్లర్ వేసుకుని మీ మెదడు దెబ్బతీయడం కంటే విశ్రాంతి తీసుకోవడం మంచిది. నిదురపోవడం ఉత్తమం. ఆఫీస్లో నిదుర పోవడం వీలుకానివాళ్లు కళ్ళు మూసుకుని కొంతసేపు మెడిటేషన్ చేయాలి.
మనం కింద పడ్డప్పుడో, ఏదైనా దెబ్బ తగిలినప్పుడో ఆ భాగంలో నొప్పి వస్తుంది. అది తాత్కాలిక నొప్పి. దానికి తాత్కాలిక ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్ రెండు, మూడు రోజులు మాత్రమే వాడవచ్చు. కానీ చాకేట్లేలు తిన్నట్లు రోజు మింగితే మూత్ర పిండాలు దెబ్బతింటాయి. మెదడు సమస్యలు రావచ్చు.
వయసు మళ్ళిన వాళ్లకు మోకాళ్ళ నొప్పులు తరుచు వస్తాయి. డాక్టర్ దగ్గరికి వెళ్లి వెంటనే వైద్యం చేయించుకోవాలి అని ఆ నొప్పి హెచ్చరించడం. కానీ చాలా మంది పెయిన్ కిల్లర్ మందులు రోజూ వాడడంవలన మూత్రపిండాల వ్యాదితో ప్రణాలమీదికి తెచ్చుకుంటున్నారు. కావున దీర్గకాలిక వ్యాదులకు ఎట్టి పరిస్టితిలోను పెయిన్ కిల్లర్ మందులు వాడొద్దు.
మరి నివారణ ఏమిటి?
నొప్పిని భరించడం కూడా మంచిది కాదు. తాత్కాలిక ఉపశమనం కోసం కండరాల నొప్పులు ఉన్నవాళ్ళు ఆయింట్మెంట్ లు కొన్ని రోజులపాటు వాడొచ్చు.
వేడి నీళ్ళతో కాపడం పెట్టడం ఉత్తమం. ఆ వేడికి కండరాలలోని రక్తప్రసరణ వేగం పెరుగుతుంది. బ్లాక్ అయ్యిన రక్తం లో కదలిక వస్తుంది.
ఇస్ క్యూబ్ కూడా మంచిదే. ఇది మన శరీరంలోని హీలింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. తలనొప్పి వచ్చిన వాళ్ళకు ఇది గొప్పగా పని చేస్తుంది. అంతేకాని చాక్లెట్ చప్పరించినట్లు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ చప్పరించకండి, ప్రణాలమీదికి తెచ్చుకోకండి.