నారా లోకేష్ చేపట్టిన “యువగళం” పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయి ప్రస్తుతం బెంగళూర్ లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు ప్రకటిస్తున్నారు.
నిష్ణాతులైన వైద్య బృందం తారకరత్నకు వైద్య సేవలందిస్తోంది. ఆయన కోలుకుంటారని త్వరలోనే మామూలు మనిషిగా తిరిగి వస్తారని కుటుంబసభ్యులు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్న తారకరత్న తాజాగా పాదయాత్రలో పాల్గొని సొమ్మసిల్లి పడిపోవడంతో ఒక్కసారిగా ఆయన గురించిన చర్చ ప్రారంభమైంది.
చాలామంది తారకరత్న వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. తారకరత్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డికి అల్లుడు అవుతాడు. విజయసాయి రెడ్డి భార్య సునంద సొంత చెల్లెలు కుమార్తె అలేఖ్య రెడ్డిని తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహంతోనే ఆయన కుటుంబానికి దూరమయ్యాడు.
అలేఖ్య రెడ్డి ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకు గాను ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మరి పెళ్లి చేసుకున్నారు. అయితే తారకరత్న భార్య అలేఖ్యకు ఇది మొదటి వివాహం కాదని…ఆమెకు ఇదివరకే వివాహం జరిగిందనే విషయం చాలామందికి తెలియదు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం రెండవ వివాహంగా తారకరత్నను పెళ్లి చేసుకున్నారు.
అలేఖ్యకు టీడీపీ మాజీ మంత్రి ఎలిమిరెడ్డి మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డితో మొదట పెండ్లి అయింది. సందీప్ రెడ్డిని పెళ్లి చేసుకున్న తరువాత కొన్నాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాని అనంతరం వారి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నటువంటి అలేఖ్యకు తారకరత్నతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2012 ఆగస్టు 2వ తేదీన సంఘీ టెంపుల్లో వివాహం చేసుకున్నారు.వీరికి ఓ పాప కూడా ఉంది.