టీఆర్ఎస్ అనుకూల పత్రిక సంచలన కథనం ప్రచురించింది. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నించినట్టుగానే ఏపీ సర్కార్ ను కూడా కూలదోయాలని చూసిందని పేర్కొంది.
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో ఈ విషయం బయటపడినట్లు పేర్కొంది. తెలంగాణ, ఏపీతోపాటు మరో మూడు రాష్ట్రాలు బీజేపీ హిట్ లిస్టులో ఉన్నాయని వెల్లడించింది. అయితే, ఏపీ సీఎం జగన్ తో స్నేహపూర్వకంగా మెదిలే బీజేపీ అగ్రనేతలు వైసీపీని కూల్చేందుకు ప్రయత్నించారనే కథనం వైసీపీ శిబిరంలో కలవరం రేపుతోంది.
టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. మీకే తెలివి ఉందా – మాకు లేదనుకుంటున్నావా..!
ఏపీ అధికార పార్టీకి చెందిన 70మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని..వీరిలో 55కి పైగా ఎమ్మెల్యేలు మధ్యవర్తుల టచ్ లోకి వెళ్ళారని సిట్ దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొంది. జగన్ కేసులను అడ్డు పెట్టుకొని వైసీపీ సర్కార్ ను కూలదోసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిందితులు సిట్ అధికారులకు తెలిపినట్టు సమాచారం ఉందని టీఆర్ఎస్ అనుకూల పత్రిక పేర్కొంది.
ఏదీ ఏమైనా ఈ కథనం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఈ కథనంపై ఇప్పటివరకు వైసీపీ నేతలు స్పందించలేదు.