టాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ లేటు వయస్సులో పెళ్లి పీటలు ఎక్కనున్నాడని ప్రచారం జరుగుతోంది. 43ఏళ్ల వయస్సున్న దేవి శ్రీ ప్రసాద్ బ్యాచిలర్ లైఫ్ కు తన పెళ్లి కార్డుతో ఎండ్ కార్డు వేయనున్నాడని ఫిలింవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కోట్ల సంపాదన ఉన్నా డీఎస్పీ ఎందుకో పెళ్లి చేసుకోలేదు. కానీ పలువురు స్టార్ హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి. అందాల తార ఛార్మితో దేవి శ్రీ ప్రసాద్ డేటింగ్ కూడా చేసినట్లు ఫోటోలు కూడా బయటకొచ్చాయి. పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారు. ఆ తరువాత ఏమైందో ఏమో ఈ జంట మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. అనంతరం మరికొంతమంది హీరోయిన్స్ తో డీఎస్పీ డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు వచ్చాయి కానీ అవన్నీ గాలి వార్తలుగానే మిగిలిపోయాయి.
కాగా ఎట్టకేలకు దేవి శ్రీ ప్రసాద్ పెళ్లికి అంగీకరించినట్లు టాలీవుడ్ కోడై కూస్తోంది. పెళ్లి చేసుకోవాలని కుటుబ సభ్యులు ఒత్తిడి పెంచడంతో చివరికి అంగీకరించారట. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి డీఎస్పీకి వరుసకు మరదలు అవుతుందట. ఇది బాగానే ఉన్నా.. దేవి శ్రీ ప్రసాద్ కు అమ్మాయికి మధ్య పదిహేడేళ్ళ వయస్సు వ్యత్యాసం ఉందట.
దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడి వివాహం కావడంతో అతని కూడా పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు చేసిన ఒత్తిడి ఫలించిందని… త్వరలోనే ఈ మ్యూజిక్ డైరక్టర్ ఓ ఇంటిఅల్లుడు కాబోతున్నాడని ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుఫుతోంది.
Also Read : పవన్ కళ్యాణ్ కు సిగ్గు లేదంటూ త్రివిక్రమ్ భార్య షాకింగ్ కామెంట్స్