నోట్ల రద్దుపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం సబబేనా అనే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు రిజర్వ్ బ్యాంక్ తీసుకోవాలి కాని, కేంద్రమే తీసుకుంది. దీంతో ఈ నిర్ణయం చట్టబద్దమేనా అనే అంశంపై విచారణ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు వెలువరించింది. నోట్ల రద్దు సరైన నిర్ణయమేనని స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్ఏ నజీర్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నోట్ల రద్దుపై విచారణ చేపట్టి సోమవారం తుది తీర్పు వెల్లడించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ నాగరత్న మాత్రమే నోట్ల రద్దును వ్యతిరేకించగా మిగిలిన నలుగురు సమర్ధించారు. 4: 1 మెజార్టీతో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.
ఇక ఇదిలా ఉండగా.. కేంద్రం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం వలన శిక్షకు గురైన వారి మాటేమిటి..? అన్నది ఎవరూ ఆలోచించడం లేదు. 2016, నవంబర్ ఎనిమిదిన రాత్రి మీడియా ముంగిటకు వచ్చిన ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రధాని నిర్ణయంతో అందరూ ఇబ్బంది పడిన వారే. కూలీ పని చేసుకునే వారి నుంచి కుబేరుల వరకు ఇలా అందరూ ఇబ్బందులను ఎదుర్కొన్నవారే. ధవవంతులు ఎన్ని ఇబ్బందులు పడినా… వారి, వారి స్థాయిలో వారు సెటిల్ చేసుకున్నారు. కాని సామాన్యుల కథేంటి..? నోట్ల మార్పిడి కోసం ఏటీఎంల దగ్గర గంటలకొద్ది క్యూ లైన్ లో నిల్చొని కుప్పకూలి చనిపోయిన వారి సంగతేంటి..? బ్యాంక్ ఖాతాలో డబ్బున్నా నోట్ల రద్దుతో సకాలంలో డబ్బులు అందక అయినవాళ్ళను కోల్పోయిన వారి మృత్యువేదనకు కారణం ఎవరు..? చేతుల్లో చిల్లిగవ్వ లేక తిండికి కూడా ఇబ్బందులు పడిన వారి బాధలు ఎవరు అర్థం చేసుకుంటారు..? దీనికి నోట్ల రద్దు నిర్ణయం కారణం కాదా..? మరి ఈ శిక్షకు బాధ్యత ఎవరు వహించాలి.
నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్ధిక వ్యవస్థ క్షీణించింది. కొన్ని వందల పరిశ్రమలు క్లోజ్ అయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు. ముందు చూపు లేకుండా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో దేశం మరింత వెనక్కి వెళ్ళిపోయిందని ఆర్థికవేత్తలు అభిప్రాయాలను వినిపించారు. పరిశ్రమల మూతకు, నిరుద్యోగం పెచ్చురిల్లాడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయమే కారణం. నోట్ల రద్దు కాలంలో జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి. మరి వారి ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు..?
Also Read : బీజేపీకి బీఆర్ఎస్ భయపడుతుందా..?
నోట్ల రద్దు ఓ విప్లవాత్మక నిర్ణయమని కేంద్రం, బీజేపీ పెద్దలు తెగ ప్రచారం చేసుకున్నారు. కాని అంత ఉత్తదేనని తరువాత తెలిసిపోయింది. నోట్ల రద్దు వలన ఎలాంటి మార్పు వస్తుందో చూడండి. కేవలం 50రోజులు వెయిట్ చేసి చూడండి. ఎలాంటి మార్పు లేకపోతే నన్ను తగలబెట్టండని పెద్ద డైలాగ్ కొట్టారు ప్రధాని. బ్లాక్ మనీ బయటకు వస్తుందని, ఉగ్రవాదానికి నిధుల సరఫరా నిలిచిపోతుందని చెప్పారు. కాని బ్లాక్ మనీ బ్యాంక్ లో చేరి వైట్ అయిపొయింది. కశ్మీర్ లో ఉగ్రవాదులు దొంగ నోట్లు ముద్రించకుండా అన్నారు. కానీ ఇప్పుడు అవి వస్తూనే ఉన్నాయి. కేంద్రం నిర్ణయం సరైనదే కావొచ్చు కాని ఏ తప్పు చేయని ప్రజలే శిక్ష అనుభవించారు.
Also Read : అంతర్గత సర్వేలో బీజేపీకి బిగ్ షాక్