ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇటీవలే ఈడీ విచారణను ఎదుర్కొన్న కవిత ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరు కానున్నారు. మొన్నటి విచారణకు కవిత పెద్దగా సహకరించలేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తనకున్న సమాచారంతో చెప్పుకొచ్చారు. మొదటిసారి విచారణలోనే కవితను ఏకంగా 9గంటలపాటు విచారించినా మరోసారి విచారణకు హాజరు కావాలన్నారంటే మొదటి విచారణకు ఆమె సహకరించకపోవడమేననే అనుమానాలు తాజాగా బలపడుతున్నాయి.
రెండో విచారణలో ఈడీ ప్రధానంగా కవిత ఆర్ధికమూలాలపైనే దృష్టిపెట్టిందని సమాచారం. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ తరుఫున కవితే కీలకంగా వ్యవహరించారని ఈడీ బలంగా నమ్ముతోంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించింది. వీటిపై మొదటి విచారణలో కవితను ప్రశ్నించగా ఆమె పెద్దగా నోరు విప్పలేదని అంటున్నారు. పక్కాగా సాక్ష్యాలను ముందుంచి ఈడీ ప్రశ్నించడంతో విచారణకు కవిత సహకరించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
స్కామ్ లో భాగంగానే కవిత వంద కోట్లను సమకూర్చిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఈ వంద కోట్లు ఎక్కడినుండి వచ్చాయి ? ఎవరెవరికి ఎంతెంత ఏ మార్గాల్లో చేరిందనే విషయాలను ఈడీ తెలుసుకోవాలని అనుకుంటోంది. ఈ విషయాలపైనే కవితను ప్రశ్నించబోతోంది. అయితే ఈడీ విచారణకు కవిత ఏమేరకు స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. మొదటి విడత విచారణకు సహకరించని కవిత రెండో విడత విచారణకు సహకరిస్తుందా..? అనేది సస్పెన్స్ గా మారింది.
ఇకరెండోసారి కూడా ఆమె విచారణకు సహాకరించకపోతే…విచారణకు సహకరించడం లేదనే కారణం చూపి కవితను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
Also Read : కవితక్క సారా దందాలో తెలంగాణ అడబిడ్డలకు పొత్తుందా?