భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్ కార్డియాలజిస్ట్ అసీమ్ మల్హోత్ర ‘కోవిషిల్డ్ వ్యాక్సిన్’ చాలా ప్రమాదకమని సంచలన ప్రకటన చేశాడు.
ఈ వాక్సిన్ దుష్ప్రభావాలు mRNA వాక్సిన్ల కంటే ప్రమాదకరమని తాను జరిపిన ప్రయోగాల ఫలితాలను ప్రకటించారు. ఆస్ట్రేజన్ సంస్థ విడుదల చేసిన దీనివలన గుండెపోటు, పక్షవాతం లాంటి ప్రమాదక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన పరిశోధనాలల్లో తేలింది. ఇది నిజమని నమ్మడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. బ్రిటన్ లో ఈ వ్యాక్సిన్ పొందిన పదిశాతం మందిలో ఈ దుష్ప్రభావాలు కనిపించాయి.
కరోనా మహమ్మారి వలన దేశంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాకు విరుగుడుగా వచ్చిన వ్యాక్సిన్ లతో చాలామంది కోవిడ్ ను జయించారు. ‘కోవిషిల్డ్ వ్యాక్సిన్’ ను తీసుకున్నవారిలో చాలామంది అనారోగ్య సమస్యలు వెలుగుచూస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చిన మొదట్లోనే ఈ టీకాలు మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు కూడా చెప్పారు. కాని తక్షణ ప్రమాద నివారణిగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు.
సంపూర్ణ ఆరోగ్యంతో కనిపించే చాలామంది వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు లాంటి కారణాలతో మృతి చెందుతున్నారు. ఇందుకు కరోనా వ్యాక్సిన్ లే కారణమన్న అనుమానాలు కల్గుతున్నాయి. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్ కార్డియాలజిస్ట్ అసీమ్ మల్హోత్ర చేదు వార్త వినిపించారు. కొంతమంది వైద్య నిపుణులు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.
Also Read : సడెన్ హార్ట్ స్ట్రోక్ లకు కారణం కరోనా వ్యాక్సినేనా..?