చైనాను హడలేతిస్తోన్న కరోనా మహమ్మారి ఇండియాలోనూ నెమ్మదిగా స్పీడ్ పెంచుతోంది. గత రెండు రోజులుగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే మన దగ్గర కూడా కరోనా విస్పోటనం ఉంటుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
శుక్రవారం 201 కరోనాకేసులు నమోదు కాగా, శనివారం 227 కేసులు నమోదు అయ్యాయి. మహమ్మారి కారణంగా ఇద్దరు మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఇండియాలో 3,424 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,30,693కి చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్ లలో యాక్టివ్ కేసులు 0.01శాతం కాగా, జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.80శాతానికి పెరిగింది.
దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా నివారణ చర్యలపై తిరిగి దృష్టి సారించాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవియాతోపాటు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా కరోనాపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
గత అనుభవాల దృష్ట్యా కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని… కోవిడ్ గైడ్ లైన్స్ పాటించాలంటూ దేశ ప్రజలను కోరారు ప్రధాని.