విదేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోన్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ BF7వేరియంట్ ఇండియాను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. విదేశాల్లో నెలకొన్న పరిస్థితులే దేశంలోనూ నేలకొంటాయా అనే గాబరా పడుతోన్న జనాలకు పెరుగుతోన్న కేసులు ముప్పు తప్పదనే సంకేతాలు ఇస్తున్నాయి. విదేశాల నుంచి వస్తోన్న వారు కరోనాను మోసుకువస్తుండటంతో ఇండియాలో ఈ కొత్త వేరియంట్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రాయాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన ఆరు వేల మందికి టెస్టులు చేయగా వారిలో 39మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
చైనా నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని టెస్టు చేయాలని నిర్ణయించింది. ఆర్టీ పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే ఇండియాలోకి అనుమతించాలని అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని.. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన భారీ మూల్యం చెల్లించుకొకతప్పదని హెచ్చరించింది.
పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రానున్న 40రోజులు అత్యంత కీలకమని, జనవరి రెండో వారానికి కేసులు పెరిగే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. న్యూ ఇయర్, పండగలు వస్తుండటంతో ఈ వేరియంట్ సామజిక వ్యాప్తికి దారి తీస్తుందేమోనని కేంద్రం భావిస్తోంది.