ఇండియాలో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరోసారి కరోనా విలయం తప్పదా అనే అనుమానాలు కల్గుతున్నాయి. కాగ తెలంగాణలో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కరోనా సోకింది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ సమీపంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 15మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 15మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో వారందరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఒకేసారి 15మంది విద్యార్థులు కరోనా బారిన పడటంతో సహా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురి అవుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులను తమ ఇంటికి తీసుకేళ్ళెందుకు తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుంటున్నారు.
.దేశంలో గత 24 గంటల వ్యవధిలో ఐదు వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1,60,742 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,335 కొత్త కేసులు బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇది నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువ. గతేడాది సెప్టెంబర్ 23 తర్వాత రోజూవారీ కొవిడ్ కేసులు 5,000 వేల మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి.
Also Read : కరోనా వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ తో జాగ్రత్త సుమా..!