ఈ ఏడాది లో తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి.మేఘాలయ,మిజోరాం, నాగాలాండ్, త్రిపుర,రాజస్తాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక,తెలంగాణ, ఛత్తీస్గఢ్ లో ఎన్నికలున్నాయి.
60 సీట్లు ఉన్న మేఘాలయ లో 2018 ఎన్నికలు హంగ్ రాగా కాంగ్రెస్ 21 స్థానాలు గెలిచి అతి పెద్ద పార్టీ గా అవతరించింది..NPP 20 స్థానాలు UDP 6 గెలవగా BJP కేవలం రెండు గెలిచింది.బీజేపీ కేంద్రం లో అధికారం ఉపయోగించి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ సారి అక్కడ కాంగ్రెస్ సింగిల్ గా అధికారం పొందుతుంది..
మిజోరాం అక్కడ మిజో తెగ బలంగా ఉండటం వారికోసమే ఒక పార్టీ ఉండటం మిగిలిన తెగల కోసం జోరం పేరుతో ఒక ఉద్యమం నడవటం మూలాన ఇక్కడ ఆ రెండు పార్టీ లే బలంగా ఉన్నాయి.ఇక్కడ కాంగ్రెస్ మూడవ స్థానం లో ఉండగా బీజేపీ ఖాతా కూడా తెరవడం కష్టం.
నాగాలాండ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ కు 0 ఎమ్మెల్యేలు ఉండగా ఈ సారి అక్కడ కనీసం 5-9 స్థానాల్లో గెలవగలదు.NDA కూటమి లో విభేదాలు ఆ కూటమి ను ముంచబోతోంది. హంగ్ వచ్చే సూచనలు ఉన్న నేపథ్యం లో కాంగ్రెస్ మద్దతదారులు కీలకం అవుతారు.కాంగ్రెస్ మద్దతు తో ప్రభుత్వం ఏర్పడవచ్చు..
త్రిపుర లో కూడా కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేదు.ఒకరో ఇద్దరో గెలిస్తే గొప్ప ఇక్కడ.కమ్యునిస్ట్ లు బీజేపీ బలంగా ఉంది.కమ్యునిస్ట్ కాంగ్రెస్ కలిస్తే అధికారం పక్కా.కానీ ఇక్కడ బీజేపీ నే ఇంకొక లోకల్ పార్టీ ను పోషిస్తోంది కాబట్టి ఆ ఓట్ చీలిక తిరిగి బీజేపీ కే అవకాశం ఇస్తుంది ఏమో అని నా అంచనా.!
రాజస్తాన్ పోయిన సారి సచిన్ పైలట్ నాయకత్వం లో కాంగ్రెస్ గెలిస్తే అప్పట్లో ఉన్న ముసలి లాబీ అశోక్ గెహ్లోత్ ను సీఎం ను చేశాయి మనోడు ఎమ్మెల్యే లో పట్టు నిలుపుకున్నా జనాల్లో లేదు.ఇప్పుడు రాహుల్ సీఎం మార్పు చేయాలి అని పట్టుగా ఉన్నా ఖర్గే, రాజస్తాన్ శాసన సభా పక్షం సహకరిస్తుంది అనే నమ్మకం లేదు. గెహ్లోత్ నాయకత్వం లోనే పోతే కష్టం ఇక్కడ గెలవటం ఇక్కడ కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే అది చరిత్ర అవుతుంది.కానీ రాహుల్ గాంధీ యాత్ర ప్రభావము ఇక్కడ గట్టిగా ఉండబోతోంది దాన్ని అందిపుచ్చుకుంటే చరిత్ర సృష్టిస్తాము..ఇక్కడ హామీ ల అమలు అనేది పాజిటివ్ కాగా 600 కే గాస్ సిలిండర్ ఇస్తుండటంతో పాజిటివ్ టాక్ చాలా బాగుంది.
మధ్యప్రదేశ్:- అక్కడ సింధియా మీద అతని వర్గం వెన్నుపోటు మీద కాంగ్రెస్ కేడర్ లో చాలా కోపం ఉంది ఈ సారి చావో రేవో అన్న రీతిలో కాంగ్రెస్ కేడర్ కష్టపడుతోంది.దానికి తగ్గట్టు కమల్ నాథ్ చాలా కష్టపడుతూ ఉన్నారు.పైగా బీజేపీ లో ఉన్న లుకలుకలు కాంగ్రెస్ గెలుపుకు మరింత దోహదం చేస్తాయి.మధ్యప్రదేశ్ ఈసీ గా కాంగ్రెస్ ఖాతా లో పడుతుంది.ఉన్న కొద్ది నెలల్లో CPS రద్దు4 చేయటం మూలాన కమల్ నాథ్ పై చాలా పాజిటివ్ గా ఉన్నారు ఉద్యోగులు.
కర్ణాటక:- కర్ణాటక లో బీజేపీ బొమ్మై సర్కార్ ఎన్నికలకు ఆరు నెలల ముందే కాడి వదిలేసి చోద్యం చూస్తోంది.గాలి సపరేట్ పార్టీ పెట్టటం యడ్యూరప్ప సైలెంట్ అవ్వటం బీజేపీ కి పెద్ద ఎదురు దెబ్బ.KCR ఇక్కడ JDS తో చేయి కలపటం మూలాన కాంగ్రెస్ ముఖ్యంగా సిద్దరామయ్య JDS ను టార్గెట్ చేశాడు.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 146 స్థానాలు గెలుస్తారు అని సర్వే లు చెప్తుండగా కాంగ్రెస్ టార్గెట్ ఇక్కడ 175 గా పెట్టుకుంది..కర్ణాటక కాంగ్రెస్ గెలిచింది ఎన్నికలకు ఆరు నెలలు ముందుగానే..
తెలంగాణ.:- ఇక్కడ ఇప్పుడు పరిస్తితి ఆశా జనకంగా లేకున్నా రేవంత్ పాదయాత్ర తరువాత మారే అవకాశం కనిపిస్తోంది..విభేదాలను పరిష్కరించటంలో రేవంత్ ఎంత చొరవ చూపితే గెలుపు కు అంతా అవకాశం ఉంది.కెసిఆర్ BRS అని బిల్డప్ లు ఇస్తున్నా అతను చేస్తున్న ప్రధాన తప్పు కర్ణాటక ఏపీ లో వేలు పెట్టటం.కర్ణాటక లో కాంగ్రెస్ గెలిచాక వాళ్ళు తెలంగాణ లో ఖచ్చితంగా వేలు పెడతారు అన్నీ విధాలా సహకారం ఉంటుంది.స్వయంగా హరీష్ రావు కాంగ్రెస్ కేడర్ ను చేల్చటం అసాధ్యం అని ఒప్పుకోవటం సంస్థాగతంగా కాంగ్రెస్ బలం చాటినట్టే.కనీసం 40 స్థానాలు గెలుస్తాం అంతర్గత సమస్యలు పరిష్కారం చేసుకొని హంగ్ ఛాన్స్ వస్తె కాంగ్రెస్ కింగ్ మేకర్ అవ్వటం పక్కా..
ఛత్తీస్గఢ్:- CPS రద్దు అంశం వల్ల ఇక్కడ ఉద్యోగుల సహకారం అద్భుతంగా ఉంది.కాంగ్రెస్ తిరిగి అధికారం లోకి వస్తుంది.మొత్తం తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు ఉండగా మెజారిటీ కాంగ్రెస్ కు అనుకూలం అవ్వబోతోంది…
ఈ ఏడాది మొత్తం కాంగ్రెస్ ప్రజల్లో ఉండాలని స్థానిక నాయకత్వాలకు గట్టి సంకేతాలు ఉండగా ప్రతి చోట పర్యవేక్షణ కోసం హైకమాండ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది..కాంగ్రెస్ కు స్వర్ణయుగం తిరిగి మొదలు కాబోతోంది.. ఖర్గేఅనుభవం ఉపయోగపడుతోంది..రాహుల్ ప్రియాంక లు సర్వ శక్తులు ఒడ్డుతారు..