తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో కవితను సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓడించారని వ్యాఖ్యానించారు.
లైగర్ సినిమాలో కవిత పెట్టుబడులు – చర్చను పక్కదోవ పట్టించే ప్లాన్ ..?
కవిత ఎంపీగా గెలిస్తే తమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలే ఆమెకు వెన్నుపోటు పొడిచారని జీవన్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పడిన ఓట్లు కవితకు పడకపోవడమే ఇందుకు నిదర్శమన్నారు. నిజామాబాద్ లో రైతుల చేత నామినేషన్ వేయించింది బీజేపీనే అని చెప్పారు. వారితో కాంగ్రెస్ నామినేషన్ వేయిస్తే బీజేపీలో ఎందుకు చేరుతారని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్ ల మాటల యుద్ధం – అసలు స్టొరీ ఇదా..!?
మీడియా సమావేశంలో కవిత పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలే ఆమె ఓటమికి కారణమని ఎంపీ అరవింద్ కూడా ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో కవితకు మెజార్టీ దక్కకపోవడంతో.. ఎమ్మెల్యేలే కవితకు వెన్నుపోటు పొడిచారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లో కేసీఆర్ కూడా సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే.