తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిని చల్లార్చేందుకు వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో బెట్టు చేయాలని సీనియర్ నేతలు భావించారు. అధిష్టానం దూతగా వచ్చిన దిగ్విజయ్ వద్ద పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని తొలగించేలా ఉమ్మడి డిమాండ్ తో వాదనను వినిపించాలని సీనియర్లు గట్టిగా ఫిక్స్ అయ్యారు. రేవంత్ ను పదవి నుంచి తప్పించకపోయిన కనీసం రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్ నైనా తొలగించేలా డిగ్గీరాజాపై ఒత్తిడి పెంచాలనుకున్నారు. దిగ్విజయ్ సింగ్ తో భేటీ తరువాత ఠాగూర్ ను తొలగిస్తున్నట్లు ప్రకటన వెలువడుతుందని ప్రచారం చేసుకున్నారు. కాని దిగ్విజ య్ సింగ్ మాత్రం ప్రాబ్లం సాల్వ్ అయిందని..బహిరంగంగా అసంతృప్తి వ్యాఖ్యలు చేయవద్దని చెప్తూ వెళ్ళిపోయారు. అంటే..రేవంత్ ను కాని, ఠాగూర్ ను తొలగించే అవకాశం లేదన్నది స్పష్టం అవుతోంది.
Also Read : ఉత్తమ్ గేమ్ ప్లాన్ అర్థం చేసుకోని ఓయూ జేఏసి నేతలు..!
ఏదో ఒక విధంగా అధిష్టానం తమను సంతృప్తిపరుస్తుందని సీనియర్లు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. హైకమాండ్ అసలే పట్టించుకోలేదన్నట్లుగా సీనియర్లతో మాట్లాడేందుకు హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ ను పంపింది. ఆయన వచ్చారు. సీనియర్లతో, రేవంత్ వర్గం నేతలతో విడివిడిగా మాట్లాడారు. కాకపోతే సమస్య పరిష్కారానికి ఎలాంటి సూచనలు చేయకపోయినా సీనియర్లు, జూనియర్లంటూ ఉండరని చెప్పడంతో.. ఇక నుంచి సీనియర్ నేతలు కాస్త ఓవరాక్షన్ తగ్గించాలని చెప్పినట్లైంది. అందుకే జగ్గారెడ్డి మళ్ళీ గాంధీ భవన్ లో ఇకనుంచి ఏఐసీసీ పెద్దలను కలవనని చెబుతున్నారు. జగ్గారెడ్డి వాదనను చూస్తుంటే.. సీనియర్లను అధిష్టానం లైట్ తీసుకున్నట్లు కనబడుతోంది.
Also Read : వెర్రిపుష్పాలైన తొమ్మిది మంది సీనియర్లు
సీనియర్ నేతలను అధిష్టానం నచ్చజెప్పి దారిలో పెట్టాలని మాత్రమే అనుకుంటుంది. కాని వారి డిమాండ్ మేరకు పీసీసీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ను మార్చేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. దీంతో రేవంత్ కూడా తన పని తాను చేసుకుపోతున్నారు. పాదయాత్రకు రెడీ అవుతున్నారు. సీనియర్ నేతలు ఈ పాదయత్రలో పాల్గొంటారో లేదో స్పష్టత లేదు. వారు చేసిన నిర్వాకానికి పార్టీ క్యాడర్ కూడా చీదరించుకుంటుంది. ఎవరో కొంతమంది మాత్రమే సీనియర్ల పాట పడుతున్నారు తప్ప ఆదరణ పూర్తిగా కరువు అవుతోంది. ఇక , సీనియర్లు పక్క పార్టీలోకి వెళ్తే అక్కడ ఎలాంటి అవకాశాలు ఉంటాయో తెలియదు. ఇప్పుడు సీనియర్లు అటు, ఇటు కాకుండా పోయారు.
Also Read : సీనియర్ల గాలి తీసిన దిగ్విజయ్ సింగ్