వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమైన వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ ఒకటే ఆప్షన్ ఇచ్చింది. తెలంగాణలో రాజకీయాలు చేయడం అస్సలు కుదరదు. ఏపీలో కాంగ్రెస్ తరుఫున రాజకీయాలు చేస్తానంటే ఒకేనని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చి చెప్పింది. దాంతో షర్మిలకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో పాలుపోవడం లేదు.
తెలంగాణను వీడి ఏపీలో చేరితే ఏపీ పీసీసీ చీఫ్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒకే చెబుతోంది కానీ, ఇన్నాళ్ళు తెలంగాణలో తాను మాట్లాడిన మాటలకూ, చేసిన పాదయాత్రకు ఓ అర్థం లేకుండా పోతుందని ఆమె ఫీల్ అవుతున్నారు. పైగా ఏపీలో అన్న జగన్ ను ఎదురించి రాజకీయాలు చేసేందుకు షర్మిల వెనకా ముందు ఆడుతున్నారు.
వైఎస్ ఆత్మ కేవీపీ కూడా షర్మిలను ఏపీలో రాజకీయాలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ జెండాతో వెళ్తే రాజకీయ ఎదుగుదల ఉంటుందని ఒత్తిడి తెస్తున్నారు. ఎంతోమంది నేతలు, వైఎస్సార్ అభిమానులు, జగన్ వ్యతిరేకులు షర్మిల వెంటే నడుస్తారని.. తెలంగాణ కన్నా ఏపీనే బెటర్ ఛాయిస్ అని షర్మిలకు సూచిస్తున్నారు. కానీ ఆమె మాత్రం ఓ నిర్ణయం తీసుకోలేకపోతోంది. రాహుల్ గాంధీ ఖమ్మం టూర్ కంటే ముందు ఏపీ నేతలతో మాట్లాడుతూ.. షర్మిల ఏపీలో రాజకీయాలు చేస్తోందని చెప్పారు.
తెలంగాణలో ఆమె రాజకీయం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ వ్యూహకర్తలు కూడా షర్మిలకు సూచిస్తున్నారు. భవిష్యత్ దృష్ట్యా తెలంగాణను వదిలేసి ఏపీలోనే రాజకీయం చేస్తే ప్రయోజనం ఉంటుందని సలహా ఇస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు బంతి షర్మిల కోర్టులో ఉంది. జూలై ఎనిమిది కంటే ముందుగా షర్మిల కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి ఒకే చెబితే ఏపీకి వెళ్ళినట్లే. లేదంటే ఆమె వైఎస్సార్ టీపీ జెండాతో ఒంటరి రాజకీయం చేయాల్సిందే.
Also Read : ఎస్కే స్ట్రాటజీ – సికింద్రాబాద్ నుంచి వైఎస్ షర్మిల పోటీ..?