తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు పార్టీ హైకమాండ్ సుతిమెత్తగా వార్నింగ్ లు ఇస్తోంది. పార్టీలో ఇష్టం ఉంటే ఉండండి…లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చునని స్పష్టం చేస్తోంది. పార్టీలో ఉంటూ చేరికలను అడ్డుకుంటాం.. టికెట్ల విషయంలో రచ్చ చేస్తామంటే కుదరదని తేల్చి చెబుతోంది. సీనియర్లమని విర్రవీగితే వేటు తప్పదని వార్నింగ్ లు ఇస్తోంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరికను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ జోక్యం చేసుకొని వేములను పార్టీలో జాయిన్ చేసుకుంది. పార్టీకి ఉపయోగపడే నేతల చేరికలను వద్దంటే ఆగే ప్రసక్తే లేదని ప్రస్తుత చేరికతో ఇండికేషన్ ఇచ్చేసింది హైకమాండ్.
గతంలో సీనియర్లు చెప్పినట్టు నడుచుకొని తెలంగాణలో అధికారాన్ని అప్పనంగా బీఆర్ఎస్ కు అప్పగించేసింది. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా హైకమాండ్ అన్నింటిని పరిశీలిస్తుంది. కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు నివేదికలతో వ్యవహారాలను ఎప్పటికప్పుడు చక్కబెడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి దగ్గరలో ఉందని..ఏమాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకున్న మళ్ళీ బీఆర్ఎస్ పవర్ లోకి వస్తుందని నివేదికలతో హైకమాండ్ అలర్ట్ అయింది. అందుకే తెలంగాణ రాజకీయ వ్యవహారాలన్నీ హైకమాండ్ కనుసన్నలో పూర్తిగా నడుస్తున్నాయి.
బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే అంగ, అర్థబలంతోపాటు ప్రజల్లో ఆదరణ ఉండాలని హైకమాండ్ స్పష్టం చేస్తోంది. ఇతర అంశాలను ముందుంచి టికెట్లు కావాలంటూ అడగొద్దని…అలా చేసి పార్టీకి చేటు తెచ్చేలా నడుచుకోవద్దని క్లియర్ కట్ గా చెప్పేస్తోంది. తెలంగాణలో పార్టీకి గెలుపు గుర్రాలు కావాలని..అలాంటి నేతలు ఉంటె చెప్పండి.. వెంటనే టికెట్ ఇచ్చేదాం అంటూ సీనియర్లతో ఖరాఖండిగా చెప్పుకొస్తున్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి, కొండా సురేఖ ఫ్యామిలీలో ఒకరికే టికెట్ అని చెప్తుంది. పార్టీ నుంచి కుటుంబంలో ఎవరిని బరిలో నిలుపుతారో ఆలోచించుకోండి అంటూ స్పష్టం చేసింది.
మైనంపల్లి హన్మంతరావుకు రెండు టికెట్లు ఎందుకు ఇచ్చారంటే.. ఇద్దరిని గెలిపించుకొని వస్తామనే నమ్మకాన్ని కల్పించారని తేల్చి చెబుతోంది హైకమాండ్. మొత్తంగా కాంగ్రెస్ హైకమాండ్ తీరు చూస్తుంటే.. చిన్న పొరపాటు కూడా జరగకుండా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read : క్షణాల్లో నిర్ణయాలు – తెలంగాణ కాంగ్రెస్ యమ స్పీడ్.!!