సాంకేతిక పెరగడంతో చాలామంది ఆన్ లైన్ కొనుగోళ్ళపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. నచ్చిన వస్తువులను ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు..ఆహార పదార్థాలను కూడా ఆన్ లైన్ లోనే బుక్ చేస్తున్నారు. అటు ఫుడ్ ను డెలివరీ చేసే యాప్స్ చాలానే రావడంతో.. ఇంటి నుంచి ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారు.
ఇది బాగానే ఉంది కానీ, అప్పుడప్పుడు ఆర్డర్ చేసిన ఫుడ్ లో క్రిమి కీటకాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. వాటిని చూసి కంప్లైంట్ చేస్తున్నారు కస్టమర్లు. దాంతో మరోసారి ఇలాంటి వాటిని జరగకుండా చూసుకుంటామని ఉచితంగా ఫుడ్ ను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన ఫుడ్ లో ఫుడ్ కు సంబంధం లేని వస్తువొకటి కనిపించింది.
ప్లేస్ ఎక్కడో తెలియదు కానీ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఓ యువకుడు. ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ యాప్ ‘ డోర్ డాష్ ‘ నుంచి ఓ వ్యక్తి ఫ్రెంచ్ ఫ్రైస్ , చికెన్ సాండ్ విచ్ ఆర్డర్ పెట్టాడు. తన ఫుడ్ పార్శిల్ కోసం ఎంతగానో ఆతృతగా ఎదురుచూశారు.
ఆ పార్శిల్ ఓపెన్ చేసి తిందామని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి చూడగానే ఆ ఫుడ్ ను చొసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సాండ్‌విచ్ రాలేదు గానీ.. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్‌తో పాటు వాడిపడేసిన కండోమ్‌ను చూసి సదరు వ్యక్తి ఖంగుతిన్నాడు. కాగా ఈ విషయంపై ఆ ఫుడ్ డెలివరీ సంస్థకు అతడు ఫిర్యాదు చేయగా.. డబ్బులు వాపస్ వచ్చాయి. అలాగే సదరు కంపెనీ.. ఈ ఘటన ఎలా చోటు చేసుకుందన్న దానిపై దర్యాప్తు చేస్తోందని సమాచారం.