అవును. మీరు చదివింది అక్షరాలా నిజం. ఇకనుంచి కండోమ్, గర్బనిరోదక మాత్రలు, అబార్షను బ్యాన్ చేశారు. కండోమ్ వాడకపోతే మీకు ఎలాంటి జబ్బులు వచ్చినా పర్వాలేదు. స్త్రీ గర్భం దాల్చితే చాలు. ఆ స్త్రీ కి 50 ఏళ్ళు నిండినా పర్వాలేదు. ఆమె గర్భం దాల్చితే చాలు. ఆమెకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు. గర్భం దాల్చితే చాలు. టార్గెట్ ఒక్కటే. సంతానం పెరగాలి. ఆ దేశం జనాభా చైనా లా పెరగాలి, ఆ మతం జనాభా కొండంతలుగా పెరగాలి. అంతే!
భయపడకండి. ఇది మన దేశంలో కాదు. మరి ఎక్కడో ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది. అవును. మీరు ఉహించింది కరెక్ట్. ఆఫ్గనిస్తాన్ దేశంలో. అదికూడా తాలిబాన్ల పరిపాలనలో. ఇలాంటి నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. స్త్రీలను ఎలా కట్టడి చేయాలో వాళ్ళకు బాగా తెలుసు.
ప్రపంచ దేశాలు వాళ్ళను ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసారులు బుజ్జగించైనా తాలిబన్లు వినరు. అందుకే ఆదివారం కొత్తగా విడుదల చేసిన కొత్త జి వో లో అన్ని మెడికల్ షాప్ లను ఆదేశించింది. ఇకపై కండోమ్, గర్బనిరోడక మాత్రలు అమ్మితే కఠిన కారాగార శిక్షలు ఉంటాయని హుకుం జారి చేసింది.