అగ్ర రాజ్యం అమెరికా మన దేశం ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తుంది. ఎలాంటి అవాంతరాలు వచ్చినా జోక్యం చేసుకోదు. ఎప్పుడు నోరువిప్పి మాట్లాడదు. ఎవ్వరయినా గుచ్చి గుచ్చి అడిగినా ‘అది భారతదేశం అంతర్గత వ్యవహారం, మేము దానిని గురించి స్పంధించము’ అని డిప్లమాటిక్ గా, సున్నితంగా తప్పించుకుంటుంది.
అలాంటి అమెరిక తొలిసారి అధికారికంగా అంతర్జాతీయ మీడియా ముందు రాహుల్ గాంధీకి పడిన రెండేళ్ళ జైలు శిక్షను ఖండించింది. మోడీకి పరోక్షంగా మొట్టికాయలు వేసి సంచలనం రేపింది. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.
ఈ రోజు ఉదయం అమెరిక అధికార ప్రతినిది వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ ‘రాహుల్ గాంధీ జైలు శిక్ష, అయన పార్లమెంట్ అనర్హత వేటును మేము గమనిస్తున్నాము. భావప్రకటనా స్వేఛ్చ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇండియాతో కలిసి అమెరికా ముందుకు సాగుతుంది అని చెప్పారు. అంటే ఇండియాలో భావప్రకటనా స్వేఛ్చ, ప్రజాస్వామ్య పరిరక్షణ సన్నగిల్లింది అనే అర్థాన్ని పరోక్షంగా చెప్పారు వేదాంత్ పటేల్.
చట్టబద్దమైన పాలన, న్యాయ స్వాతంత్రం పట్ల గౌరవం ఏ ప్రజాస్వామ్య దేశానికైనా మూల స్టంభం అని అన్నారు. అంటే ఇండియాలో చట్టబద్దమైన పాలన, న్యాయ స్వాతంత్రం పట్ల గౌరవం లేకుండా పోతోంది అని మోడిని పరోక్షంగా మొట్టికాయలు వేశాడు.
ప్రజాసామ్యం ప్రాముఖ్యతను అమెరికా ఎప్పటికప్పుడు చాటి చేపుతోంది అని అన్నారు. అంటే ఇండియాలో మోడీ ప్రజాస్వామిక ప్రాముఖ్యతను పరిరక్షించాలి అని పరోక్షంగా హెచ్చరిచాడు. లేకపోతే మేము కల్పించు కోవలసి వస్తుంది అని పరోక్షంగా మందలించాడు.
అయితే ఈ విషయంలో అమెరిక ఇంకా మోడీ ప్రభుత్వంతో కానీ, రాహుల్ గాంధీతో కానీ ఎలాంటి సంప్రదింపులు జరపలేదు అని వేదాంత్ పటేల్ మీడియాతో చెప్పారు. అంటే ఈ విషయంలో ఇంకా మోడిని మందలించలేదు, మేము మందలించేవరకు పరిస్టితి రాకూడదు అని పరోక్షంగా మోడీని మందలించారు. అవసరం అయితే రాహుల్ గాంధీ కి సహాయం చేస్తాము అనే సంకేతాలు పరోక్షంగా ఇచ్చారు. లేకపోతే అమెరికా హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది?
ఈ మధ్య రాహుల్ గాంధీ ఒక విదేశీ మీడియాలో మాట్లాడుతూ ఇండియా లో ప్రజాస్వామ్యం కాపాడేందుకు ప్రపంచ దేశాల అవసరం ఉంది అన్నారు అనే పుకార్లు బిజెపి పుట్టించింది. ఆయన విదేశీయుల సహాయం కోరారు, దానివల్ల ఇండియా పరువుపోయింది అని బిజెపి గగ్గోలుపెట్టింది. మరి ఆ పరిస్టితి మోడీ వల్ల ఇలా రానే వచ్చింది. మరి ఇప్పుడు బిజెపి నాయకులు ఏమంటారో చూడాలి.