కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏడాది ప్రజా విజయోత్సవాలను చూస్తూ ఓ పక్క బాధలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు..తమ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అయోమయానికి గురిచేస్తున్నాయి. ఏడాది పాలనపై చేసేందుకు విమర్శలు ఏవీ లేకపోవడతో చిల్ అయ్యేందుకు కేటీఆర్ విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఈ ఉత్సవాలపై పడి ఎలా ఏడ్వాలో తెలియక గులాబీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. అయితే ఇదే సందర్భంలో కవిత మళ్లీ యాక్టీవ్ అయ్యారు. అలాగని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. కేవలం తనకు కావాల్సిన కొందరు నేతలతో మాత్రమే క్రియాశీలకంగా మాట్లాడుతున్నారు. దీంతో కారు పార్టీ నేతల్లో ఓ చర్చ ఆసక్తికరంగా మారింది. ఏపీలో వైఎస్ జగన్ కు షర్మిల్ ఎలా కొరకరాని కొయ్యగా మారిందో…ఇక్కడ కేటీఆర్ కు కవిత కూడా అలాగే తయారయ్యారని చెప్పుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకునేందుకు కేటీఆర్ కంటే తనకు తక్కువ అవకాశం లభించిందని, పార్టీలో కూడా తన మాట చెల్లలేదని ఆమె అలకతో ఉన్నారు. అప్పటి నుంచే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదు. ఆ తర్వాత జైలుకు వెళ్లడం…బెయిల్ పై రావడం అందరికీ తెలిసిందే.
అయితే కొద్ది రోజులుగా ఆమె వ్యవహారశైలిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేటీఆర్ మాటల తీరును, ప్రభుత్వం ఏ పనిచేసినా వాటిపై అడ్డగోలు వాదనలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం, పసలేని విమర్శలు చేయడం, నోటిని అదుపులో పెట్టుకోకుండా మాట్లాడటం వంటిని పార్టీలోని ముఖ్య నేతలు, కార్యకర్తలకే కాదు…సొంత కుటుంబ సభ్యులకు కూడా నచ్చలేదంట. ఇందులో కవిత కూడా ఉన్నారు. అందుకే పార్టీ ఏ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఆమె ఎప్పుడూ పాల్గొనలేదు. అంతేకాదు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నగా కులగణన సర్వేలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత కేటీఆర్ కు వ్యతిరేకంగా కార్యచరణ మొదలు పెట్టారు. తొలుత తన వర్గం నేతలతో రహస్యంగా భేటీ అయ్యారు. తాజాగా జరిగిన దీక్షా దివస్ లో మరికొందరు నేతలతో తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇప్పుడు జిల్లాల్లోనూ సమావేశాలు ప్రారంభించారు.
అయితే ఇప్పటికే తన తండ్రి కేసీఆర్ దగ్గర కూడా వీరిద్దరి పంచాయతీ సాగినట్లు గులాబీ వర్గాలంటున్నాయి. ఆస్తితో పాటూ పార్టీలో గుర్తింపుపై అన్నపై కంప్లైంట్ చేశారు కవిత. అవసరమైతే బీజేపీ సహకారం తీసుకొని ప్రత్యామ్నాయ వేదికను బలోపేతం చేస్తానని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. తనకు మద్దతిస్తున్న నేతల పేర్లు బయటకు చెప్పకపోయినప్పటికీ…ఇంత మంది నా వెంటే ఉన్నారంటూ ఓ నెంబర్ కూడా చెప్పారంట. దీంతో బుర్ర హీటెక్కిన కేటీఆర్ వెంటనే చిల్ అయ్యేందుకు దూరంగా వెళ్లిపోయారంట. కేటీఆర్, కవిత మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ పై పార్టీ సీనియర్లందరికీ క్లారిటీ ఉందట, కిందిస్థాయి కార్యకర్తల్లో కూడా దీనిపై చర్చ జరుగుతోంది. దీంతో ఓవైపు కేటీఆర్, మరోవైపు కవిత, మధ్యలో హరీష్ రావు..వెనుక నుంచి సంతోష్ రావు ఇలా పార్టీ నాలుగు ముక్కలైపోవడం ఖాయమని గుసగుసలు ఊపందుకున్నాయి.