ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తెలుగుదేశం పార్టీకి కి చెందిన ‘చైతన్య రథం’ పత్రిక కార్యాలయం లో సిఐడి అధికారులు ఈ రోజు ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. తెలుగుదేశం జనరల్ సెక్రటరీ పేరుతో నోటిసులు జారి చేశారు.
‘చైతన్య రథం’ పత్రికలో గత కొన్ని రోజులుగా అబద్దపు కథనాలు, ఎల్లో జర్నలిజం వార్తలు రాస్తోంది అని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐడి కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత అక్కడ ఉన్న లాయర్ కి నోటిసులు ఇచ్చారు సిఐడి అధికారులు.
గత ఎన్నికలల్లో బుగ్గన రాజేంద్రనాథ్ తన ఎన్నికల కమిషన్ అఫిడివీటిలో స్టిర ఆస్తులు, చర ఆస్టుల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. పత్రిక తప్పుడు కథనాలు రాసినట్లు ఆరోపిస్తూ బుగ్గన రాజేంద్రనాథ్ ఇచ్చిన పిర్యాదు మేరకు సిఐడి రంగంలోకి దిగింది. ఈ కేసు త్వరలోనే కోర్ట్ మెట్లు ఎక్కబోతోంది.
అయితే ఇదంతా రాజకీయ కుట్ర అని తెలుగుదేశం నాయకులు కన్నెర్ర చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట అని మంది పడ్డారు.