చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య” సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వాల్తేరు వీరయ్యపై అంచనాలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఎప్పుడు చూసేద్దామా అనే ఆతృతతో అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకున్నారు మెగా అభిమానులు.
తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరలు పెరిగాయి. ఏపీలోనూ ఈ సినిమాకు 25రూపాయలు పెంచుకునేందుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ఈ మూవీపై పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మెగాస్టార్ కొత్త రికార్డ్ లను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లు భారీగానే చేశారు. ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొనేందుకు ఆసక్తి చూపని చిరంజీవి ఈసారి మాత్రం వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఇటీవల మెగాస్టార్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలను పట్టించుకోవడం లేదని.. తనను అందులోకి లాగొద్దని చెప్పారు. పూర్తిగా ఏపీ రాజకీయాలను పరిశీలించడం మానేసాను..మీరందరూ పరిశీలించే దాంట్లో నేను కనీసం పాఉ శాతం కూడా పట్టించుకోను. నా దృష్టి అంత సినిమాలపైనే ఉందని చెప్పారు.
నా కుటుంబం నుంచి ఒకరు రాజకీయాల్లోకి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కాని వెళ్తాను అంటే అది వారి ఇష్టం. సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేఛ్చ వారికుంది. నా తమ్ముడు రాజకీయాల్లో ఉన్నాడని నేను పాలిటిక్స్ లో ఉండాలని రూల్ లేదు. కాబట్టి నన్ను రాజకీయాల్లోకి లాగకండి. అలాంటి ప్రశ్నలను అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ సూచించారు చిరంజీవి.