తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆరాధించే, అభిమానించే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఆయన్ను ఇండస్ట్రీ పెద్ద అంటుంటారు.కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు వ్యక్తిగతంగా కూడా ఆయన ఆదర్శప్రాయులే. సినిమా రంగంలో ఎంత ఎదిగినా నెగిటివిటిని ఎదుర్కోవడం కామనే. ఇందుకు చిరంజీవి మినహాయింపేమి కాదు. చిరంజీవి ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఆయన కుటుంబంపై నోరు పారేసుకున్నారు.
చిరుపై ఈర్ష్యతో చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేసిన వారున్నారు. ఇది ఒక్క మెగాస్టార్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన వారసుడు రామ్ చరణ్ ను కూడా హత్తుకుంది. సినిమాల పరంగా ఎంత ట్రోల్స్ వేసిన పర్వాలేదు కానీ, వ్యక్తిగతంగా వచ్చే విమర్శలు తీసుకోవడానికి చాలా కష్టం గా ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.ఆ మాటలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని డిసెంబర్ లో ప్రకటించారు చిరు. దీని గురించి మాట్లాడుతూ.. నా కోడలు తల్లి అవుతుందని తెలిసి చాలా ఎమోషనల్ అయ్యాను. ఈ విషయం నాకు మూడు నెలల ముందే తెలుసు. కాని బిడ్డ కడుపులో బిడ్డ పడిన మూడు నెలల తరువాత అభిమానులకు చెప్దామని అగానని చెప్పుకొచ్చారు.
ఉపాసన- రామ్ చరణ్ లకు సంబంధించిన కొన్ని కామెంట్స్ ను సోషల్ మీడియాలో చూసాను. ఉపాసనను ట్యాగ్ చేసి ట్రోల్స్ చేశారు. అప్పుడు చాలా బాధేసింది. ప్రతి అమ్మాయి తల్లి అవ్వాలనుకుంటుంది. కాని వ్యక్తిగత కారణాల వలన కొంత సమయం వరకు ఆగాలనుకుంటారు. ప్రతి మధ్య తరగతి కుటుంబంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కాని కానీ మేము సెలబ్రిటీలు అవ్వడం వల్ల నెగెటివిటీ ని ఎదురుకోవాల్సి వస్తోంది అంటూ చిరంజీవి ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : మూడు పెళ్ళిళ్ళపై అన్ స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీ