మనుషులలో కొందరికి ‘చిల్లర’ బుద్దులు ఉంటాయి. మరి ‘కరెన్సీ’ బుద్దులు కూడా ఉంటాయా? అంటే అవును అనక తప్పదు. దీనికి ఉదాహరణ విశాఖపట్నం కలెక్టరేట్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. తాజాగా ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వచ్చారు.
అందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్. రాజశేఖర్ కూడా ఉన్నారు. అతడు శ్రీముఖ లింగం దేవాలయ ప్రధాన ఆర్చకుడు. కాబట్టి హుండిలో వేసే చిల్లరలాగా తన ఇంట్లో కూడా ఒక హుండీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఎన్నికల కోసం ఎప్పటినుంచో చిల్లర పోగుచేస్తూ వచ్చారు.
ఇక ఎన్నికలు రానే వచ్చాయి. ఆ చిల్లరను మోసుకుంటూ నామినేషన్ వేసేందుకు విశాఖ కలెక్టరేట్కు వచ్చాడు. అక్కడివరకు బాగానే ఉంది. కానీ అక్కడే అసలు సమస్య మొదలయింది. నామినేషన్ ఫీజ్ పది వేలు చెల్లించాలి. ఆ చిల్లర తీసుకోండి అని అధికారుల ముందు చిల్లర సంచులు గుమ్మరించారు. అవన్నీ రూపాయి బిల్లలే. ఆర్బిఐ నిబంధలన మేరకు చిల్లర తీసుకుకోము అని చెప్పే హక్కు ఎవ్వరికీ ఉండదు.
కాబట్టి అధికార్లు తలలు పట్టుకున్నారు. చేసేదిలేక అందరు తమ పనులు పక్కన పెట్టి ఆ చిల్లరను లెక్కపెట్టేసరికి రెండు గంటలు పట్టాయి. ”మీలాంటి వాడు రోజుకు ఒక్కడు వచ్చినా ఈ ఏడాదిలో ఎన్నికలు జరగవురా బాబు” అని దండం పెట్టారు. ఇప్పుడు ఎన్. రాజశేఖర్ తనకు ఓట్లు వేయమని ఓటర్లకు చిల్లర పంచేలా ఉన్నాడు. జాగ్రత్త మరి.