యువగళం పాదయాత్రలోనున్న నారా లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ అందర్నీ కదిలిస్తోంది. టీడీపీ హయంలో చేసిన అభివృద్ధితోపాటు జగన్ హయంలో జరుగుతోన్న దోపిడీపై సెల్ఫీ ఛాలెంజ్ లను విసురుతున్నారు. టీడీపీ శ్రేణులు సెల్ఫీ చాలెంజ్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా వాటికి వైసీపీ సరైన ఆన్సర్ చేయలేకపోతోంది.
ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ సెల్ఫీ ఛాలెంజ్ లో భాగస్వామ్యం అయ్యారు. సెల్ఫీ వీడియోతో సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు. నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తోన్న పార్టీ కార్యక్రమాన్నికి వెళ్తుండగా టిడ్కో ఇళ్ళను చూసి బాబు అక్కడ అగ్గారు. వాటితో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో జగన్ కు సవాల్ చేశారు.
నెల్లూరులో ఇవి మా ప్రభుత్వ హయంలో కట్టిన వేలాది ఇల్లు. మేము చేసిన అభివృద్ధికి టిడ్కో ఇల్లు సజీవ సాక్ష్యాలని.. మీ ప్రభుత్వ హయంలో కట్టిన ఇళ్ళ ఆచూకీ ఎక్కడ అంటూ ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చంద్రబాబు. అంతే క్షణాల్లో చంద్రబాబు పోస్ట్ వైరల్ అయింది.
చూడు… @ysjagan! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు!
ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?#SelfieChallengeToJagan pic.twitter.com/1yoMGd4yf9
— N Chandrababu Naidu (@ncbn) April 7, 2023
టిడ్కో ఇళ్ళను అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నెల్లూరు శివారు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లు నిర్మించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహకారంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సహకారం, లబ్దిదారుడి బ్యాంక్ ఋణం కూడా ఉంది. అయితే ఇళ్ళ నిర్మాణం పూర్తైన తరువాత సరిగ్గా ఈ ఇళ్ళను పంపిణీ చేయాలనుకున్న సమయానికి ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది.
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో టిడ్కో ఇళ్ళ పంపిణీకి బ్రేక్ పడింది. తరువాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో ఇళ్ళను వెంటనే లబ్దిదారులకు పంపిణీ చేస్తే ఆ క్రెడిట్ టీడీపీకి దక్కుతుందని కార్యక్రమాన్ని నిలిపివేశారు. నాలుగేళ్ళు అవుతుండటంతో పలు చోట్ల భవనాలన్నీ పాడుబడ్డాయి. మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు ఇవ్వలేదు.
ఇలాంటి టిడ్కో ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లోనే ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ లోకేష్ సెల్ఫీలు దిగి లబ్దిదారులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేశారు. టీడీపీ నేతలు కూడా సెల్ఫీ ఛాలెంజ్ లు విసురుతుండటంతో ఏపీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.
Also Read : జగన్ కు బిగ్ షాక్ – కీలక సమావేశానికి కొడాలి, వల్లభనేని వంశీలు డుమ్మా