స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రస్తుతం సీఐడీ విచారణ ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ఏసీబీ కోర్టు విధించిన డిమాండ్ ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరుఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్దమని..ఆయనపై కక్ష సాధింపు చర్యలో భాగంగా అరెస్ట్ చేసినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. చంద్రబాబు తరుఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. తాము దాఖలు చేసిన పిటిషన్ పై వెంటనే విచారణ చేపట్టాలంటూ పేర్కొన్నారు.
ఈ కేసులో దర్యాప్తు తుది దశలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు రిమండ్ ను క్వాష్ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును వెలువరించిన తరువాత అనేక అంశాలను పరిశీలించిన టీడీపీ న్యాయబృందం, చంద్రబాబు తరుఫు న్యాయవాదులు శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సోమవారం ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందనేది టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
Also Read : అక్రమాస్తుల కేసులో జగన్ పై విచారణలో ఎందుకు జాప్యం..?