టాలీవుడ్ సంగీత దర్శకుల్లో అతి తక్కువ కాలంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో చక్రి ఒకరు. పూరి జగన్నాథ్ కెరీర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సరిగ్గా అప్పుడే చక్రి కెరీర్ కూడా ప్రారంభమైంది. చక్రిలోనున్న టాలెంట్ ను గుర్తించిన పూరి జగన్నాథ్ తన రెండో సినిమాలోనే సంగీత దర్శకుడిగా చక్రికి అవకాశం ఇచ్చారు.
అలా తనకు వచ్చిన మొదటి సినిమాతోనే చక్రి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. దాంతో పూరి సినిమాలో సంగీత దర్శకుడుగా చక్రి ఫిక్స్ అయ్యారు. వీరిద్దరి కాంబోలో ఇడియట్ , ఇట్లు శ్రావణి స్రుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, దేశముదురు , నేనింతే , శివమణి , గోలీమార్ , 143 ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి.
ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ కావడం.. చక్రికి సంగీతానికి ప్రశంసలు రావడంతో ఇతర దర్శకులు కూడా తమ సినిమాలో చక్రికి అవకాశం ఇచ్చారు. అలా ఎన్నో సినిమాలకు చక్రి సంగీతం అందించి టాలీవుడ్ లో గొప్ప సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. కెరీర్ మంచి స్టేజ్ లో ఉండగానే గుండెపోటుతో ఆయన కన్నుమూశారు.
ఇదిలా ఉండగా చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ కూడా అన్నయ్య బాటలోనే నడుస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చక్రి సోదరుడు మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన అన్నయ్య చక్రి మరణం సహజమైనది కాదని,అది హత్య అన్నట్టు రీసెంట్ గా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది.
‘అన్నయ్యది సాధారణమైన మరణమైతే పోస్ట్ మార్టం కి ఎందుకు ఒప్పుకోలేదు? పైగా మా అమ్మ విషం పెట్టి చంపింది అని కేసు పెట్టారు. అన్నయ్య చనిపోయిన రోజు నేను, అమ్మ ఇంట్లోనే లేము. 21 రోజుల నుండి బయట ఉన్నాము, అలాంటిది ఈ అబద్దపు కేసు పెట్టడానికి కారణం ఏమిటి.?సొంత తల్లి ఎక్కడైనా బిడ్డని చంపుకుంటుందా..?ఇప్పటికీ అన్నయ్య పేరు ఎత్తితే అమ్మ గుక్కపెట్టి ఏడ్చేస్తుంది, అంత ప్రేమ చక్రి అంటే.
ఆరోజు రాత్రి అన్నయ్య ఎలా మరణించాడు అనేది ఇప్పటికీ మిస్టరీ గానే మిగిలిపోయింది’ అంటూ మహిత్ నారాయణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : సంగీత దర్శకుడు చక్రి భార్య రెండో పెళ్లి – ఎవరిని చేసుకుందో తెలుసా..?