రైతు బాంధవుడిగా, సంఘ సంస్కర్తగా కలరింగ్ ఇచ్చిన బీజేపీ నేత చక్రధర్ గౌడ్ అసలు రంగు మెల్లగా బయటపడుతోంది. ఆ మధ్య తన స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నం చేసిన చక్రధర్ గౌడ్, తాజాగా ఓ యువతితో హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ లాడ్జిలో సరసాలు ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. విషయం బయటకు రావడంతో చక్రధర్ గౌడ్ పై తీవ్ర విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి. సేవా కార్యక్రమాల ముసుగులో అమ్మాయిలను లోబరుచుకుంటున్నాడని మండిపడుతున్నారు. మరోవైపు..ఈ విషయాన్ని బయటకు రాకుండా చేసేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
గాదగోని చక్రధర్ గౌడ్.. ఈ మధ్య కాలంలో సిద్ధిపేటలోనే కాకుండా పలు జిల్లాలోనూ వినిపిస్తోంది ఈ పేరు. సిద్ధిపేటలో నివాసమంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ తో ఆర్థికంగా బలంగా ఎదిగిన చక్రధర్ గౌడ్ ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించి కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఆర్ధిక సాయం అందించాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు వచ్చిన ఆయన ఓ యువతితో లాడ్జిలో సరసాలు ఆడుతూ పట్టుబడ్డాడు.
సిద్ధిపేట రాజకీయాల్లో చక్రం తిప్పాలని తహతహలాడుతున్న చక్రధర్ గౌడ్ మోసాల చిట్టా పెద్దగానే ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. చక్రధర్ గౌడ్ హైదరాబాద్ నాగార్జున సర్కిల్ ఎదురుగా ఉన్న మహీంద్రా షోరూమ్ పక్క బిల్డింగ్ లోని ఐదవ అంతస్తులో ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ నడుపుతున్నాడు. అదే బిల్డింగ్ లోని మూడో అంతస్తులో ఒక కన్సల్టెన్సీ పేరుతో ఆఫీస్ నడుపుతున్నాడు. అందులో తనకు నమ్మకస్తులైన యువతీయువకులను ఉంచి బోగస్ కంపెనీని రన్ చేస్తున్నారు.పలు ప్రాజెక్టుల పేరుతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అమాయక యువతీ,యువకుల నుంచి డబ్బులను వసూళ్లు చేయడం చక్రధర్ గౌడ్ కంపెనీ టార్గెట్. ఇదే కాదు.. గతంలో చక్రధర్ గౌడ్ దొంగ నోట్లు ముద్రణ కేసులో జైలుకు కూడా వెళ్ళాడు.
ఇటీవలి అత్యాచారయత్నం కేసులో అరెస్ట్ అయిన చక్రధర్ గౌడ్ బండారం బయటపడుతుందని..తన చరిత్రను మొత్తం ప్రభుత్వ పెద్దలు వెలికితీస్తారని భయపడే బీజేపీని ఆశ్రయించారనే విమర్శలు రాగా..ఈ విషయం ఇంకా మరిచిపోక ముందే మరో యువతీతో లాడ్జిలో పట్టుబడటం గమనార్హం. చక్రధర్ గౌడ్, ఆయన గర్ల్ ఫ్రెండ్ కలిసి ఉద్యోగాల పేరుతో 1900 మంది యువతను మోసం చేశాడన్న విమర్శలు ఉన్నాయి.
10 బ్యాచ్ యువకులు మోసపోయారు. ఒక్కో బ్యాచ్ పేరుతో 2 కోట్లు సంపాదిస్తున్నాడు.చక్రధర్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 40 మంది సభ్యులున్న కాల్ సెంటర్‌ను సీజ్ చేశారు. కాల్ సెంటర్ సిబ్బందిని కూడా అరెస్టు చేశారు. బెంగళూర్ లో ఉద్యోగాలిప్పిస్తామని భారీగా డబ్బులు వసూళ్లు చేశారు. చక్రధర్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదోతరగతి పేపర్ లీక్ చేస్తాడు..అభ్యర్థి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడు. ఇదేనా దేశం కోసం ధర్మం కోసం.? ప్రజలు ఆలోచించాలి.
Also Read : రైతు బాంధవుడనుకున్న చక్రధర్ గౌడ్ ఇంత మోసగాడా..!?