ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ పేరుతో రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోన్న చక్రధర్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను రేప్ కేసులో అరెస్ట్ చేసినట్లు శామీర్ పేట పోలీసులు మీడియాకు వెల్లడించారు. చక్రధర్ గౌడ్ అతని స్నేహితుడి భార్యపై కన్నేసి .. అత్యాచారయత్నం చేసినట్లు ఫిర్యాదు అందటంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.
ఇక…చక్రధర్ గౌడ్ అరెస్ట్ పై రాజకీయ విమర్శలు వస్తున్నాయి. రాజకీయ కుట్రతోనే అత్యాచారం కేసులో చక్రధర్ అరెస్ట్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. రైతు బంధు పథకంలో భారీగా అవినీతి జరుగుతుందని చక్రధర్ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు మరీ ముఖ్యంగా మంత్రులు , ఎమ్మేల్యేలు, ఎంపీలు రైతు బంధును వదులుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పెద్దలను ఇరకాటంలో పెడుతున్నారు. రైతులపై ప్రేమతోనే ‘రైతుబంధు గీవ్ ఇట్ అప్’ పేరుతో ఆయన రైతు బంధు ను స్వచ్ఛందంగా వదులుకున్నారు. మంత్రి మల్లారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వంటి బడా భూస్వాములు రైతు బంధు ను వదులుకోవాలని డిమాండ్ చేశారు. ఓ వైపు రైతులు ఆత్మహత్యకు పాల్పడుతోంటే… రైతు బంధు పేరిట ఏటా దాదాపు 6 వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని ఆరోపించారు. రాజకీయ నాయకులందరూ స్వచ్ఛందంగా రైతు బంధు వదులుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ జరగడం రాజకీయ కుట్ర అనే ఆరోపణలు వస్తున్నాయి. పైగా ..వచ్చే ఎన్నికల్లో మంత్రి హరీష్ రావుపై పోటీ చేస్తానని ప్రకటించారు. ఈమేరకు సిద్దిపేటలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున వందమంది రైతులకు కోటి రూపాయలు అందించారు.
https://youtu.be/VJErp3REWgA
రైతు బంధు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు చక్రధర్ గౌడ్. ఆయన రాజకీయ పరమైన విమర్శలు కూడా చేస్తున్నారు. దాంతో స్నేహితుడి భార్యను ఎరగా వేసి ఈ చక్రధర్ గౌడ్ ను కటకటాల పాలు చేశారని అంటున్నారు. ఈ అరెస్ట్ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.