మర్రి చెట్టు కింద ఏ చెట్టు పెరిగి పెద్దదవద్దని అంటుంటారు. అలాగే హరీష్ రావు ఇలాకా సిద్దిపేటలో ఆయనును కాదని మరో లీడర్ ఎదగలేరని టాక్. అంతెందుకు కేసీఆర్ అండదండలు పుష్కలంగా ఉండిన మాజీ ఐఎఎస్ అధికారి,. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సి వెంకట్రామి రెడ్డి సిద్ధిపేటలో పర్యటిస్తే అప్పట్లో హరీష్ రావు అనుచరులు అడ్డుకున్నారు. వెంకట్రామి రెడ్డి సిద్ధిపేట టికెట్ ఆశిస్తున్నారనే ఉద్దేశ్యంతోనే ఆయనను అడ్డుకున్నట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అలా.. సిద్ధిపేటలో తనకు ప్రత్యామ్నాయంగా ఎవరొచ్చిన అడ్డుపడటం హరీష్ రావు మొదటి నుంచి చేస్తుంటారని అంటుంటారు. ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోన్న చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి సిద్ధిపేటలో పొలిటికల్ యక్టివీటిస్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో హరీష్ రావుపై పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు.
గతేడాది వంద మంది రైతులకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయల చెక్కును చక్రధర్ గౌడ్ అందించాడు. పది ఎకరాలున్న తనకు రైతు బంధును వదులుకున్నాడు. బడా భూస్వాములు కూడా రైతు బంధును వదులుకోవాలని కోరుతున్నాడు. సహజంగానే ఇది భూస్వాములకు మింగుడు పడలేదు. రైతు బంధు పైసలు ఖాతాలో పడిన ప్రతిసారి చక్రధర్ గౌడ్ మీడియాలో హైలేట్ అవుతున్నారు. పైగా.. సిద్ధిపేటలో హరీష్ రావుకు పక్కలో బల్లెంలా మారాడు. రాజకీయ విమర్శలు చేస్తున్నారు. తనకంటూ గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. హరీష్ రావుకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాడు. ముఖ్యమంత్రి అండదండలుఉన్న వ్యక్తినే సిద్ధిపేటలో అడుగు పెడితే వెనక్కి వెళ్ళేలా చేసిన హరీష్ రావుకు చక్రధర్ గౌడ్ ను బలహీనపరిచడం ఎంత పని.
పైగా.. తను మంత్రి. జిల్లాలో తన మాటే పోలీసులకు వేదవాక్కు. చిన్న మాట చెబితే బొక్కలో తోస్తారు ఎవరినైనా. అలాంటిది చక్రధర్ గౌడ్ ను హరీష్ రావు ఉరికే వదిలేస్తాడా..? ఛాన్స్ లేదని అంటున్నారు రైతు ప్రేమికులు. ఆయన తాజా అరెస్ట్ వెనక రాజకీయ కుట్రకోణం ఉందని అంటున్నారు. రేప్ కేసులో చక్రధర్ గౌడ్ ను మేడ్చల్ జిల్లా షామీర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. చక్రధర్ గౌడ్ మద్యం మత్తులో స్నేహితుడి భార్యపైనే అత్యాచారయత్నం చేశాడని పోలీసులు చెబుతున్నారు. మహిళా ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఇదంతా కుట్రేనని అంటున్నారు. ఏదీ ఏమైనా.. రైతు బందావుడిగా తెలంగాణ వ్యాప్తంగా అభిమానం చూరగొన్న వ్యక్తి రేప్ కేసులో అరెస్ట్ కావడం కలకలం రేపింది.