కొన్ని నమ్మలేని నిజాలు మనం నమ్మాలి. ఓ చాయ్ వాలా మోడీ మన దేశ ప్రధానిగా మారగా, చెప్పులు కుట్టే నిరుపేద అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ గా మారగా, ఇంటింటికి న్యూస్ పేపర్లు వేసే అబ్దుల్ కలాం దేశ రాష్ట్ర పతిగా మారగా, ఇంటింటికి పాలు పోసే మల్లా రెడ్డి మంత్రిగా మారినప్పుడు, చదువుకున్న మీరు ఎందుకు బిల్ గేట్స్ కాలేరు? ఆలోచించండి. ప్రఫుల్ బిల్లోర్ ని మీరు రోల్ మోడల్‌గా తీసుకోండి. తప్పులేదు.
అహ్మదాబాద్ కు చెందిన ప్రఫుల్ బిల్లోర్ పేదరికం వల్ల 2017 ఎంబీఏ చదువును మధ్యలో ఆపేశాడు. ఒక చిన్న చాయ్ బండి పెట్టుకున్నాడు. దానిని అతని పేరో, దేవుడి పేరో పెట్టలేదు. తన అపజయాన్ని నిరంతరం గుర్తుకు పెట్టుకోవాలని ‘ఎంబీయే చాయ్‌వాలా’ అని బోర్డ్ పెట్టాడు.
ఎవ్వరు నవ్వుకోలేదు. అతని భుగం తట్టారు. అతని దగ్గరికి చదువుకున్న వాళ్ళు రావడంతో మంచి క్వాలిటీ చాయ్ తో పాటు, సూట్ వేసుకుని ఫైవ్ స్టార్ హోటల్ ట్రీట్మెంట్ బండి వ్యాపారంలో ఇచ్చేవాడు. కేవలం 5 రూపాయలకే ఫైవ్ స్టార్ హోటల్ చాయ్ దొరికేసరికి జనం ఎగబడ్డారు.
దీంతో అదే పేరుతో మరికొన్ని ప్రాంతాల్లో ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసి వ్యాపారాన్ని విస్తరించాడు. ఇదే పేరుతో ఇన్ స్టాలో అకౌంట్ క్రియేట్ చేసి కంటెంట్ క్రియేటర్ గా మారాడు. ఇతడికి 1.5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఈ దెబ్బతో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా గుర్తింపు వచ్చింది. మీడియాను పెద్ద ఆయుధం లా మార్చుకుని తన వ్యాపారాని క్రమంగా విస్తరించాడు. చాలామందికి ఉపాది కల్పించాడు. చాలా మంది నిరాశావాదులకు ఓ ఆశా కిరణంగా మారి, కేవలం అయిదేళ్ళలో శ్రీమంతుడిగా ఎదిగాడు. ఇది శ్రీమంతుడు సినిమాకు రివర్స్ కథ.
దేశంలోనే ‘ఎంబీఏ ఛాయ్ వాలా’గా గుర్తింపు తెచ్చుకున్న ప్రఫుల్ బిల్లోర్ 90లక్షల విలువ చేసే మెర్సిడెస్ ప్రీమియమ్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. దానిముందు నిలబడి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో గర్వంగా చాటాడు. ఇప్పుడు అతను తలుచుకుటే స్టార్ హోటల్ పెట్టగలడు. కానీ అదే చాయ్ బండినే నడుపుతున్నాడు.
ఈ విషయాన్ని ప్రఫుల్ తన సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్స్ కు తెలియజేశాడు. మరి ఎంబిఏ, బి.టెక్, ఎం.ఎస్ పూర్తి చేసిన మీరు మీ రంగాల్లో కూడా అంచెలంచెలుగా ఎలా ఎదగోచ్చో అలోచించండి. బి పాజిటివ్.