గౌతమ్ అదానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. ప్రజా ధనాన్ని రుణాలుగా తీసుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారని హిండెన్‌బర్గ్ స్పష్టంగా వెల్లడించింది. అదానీ కంపెనీ షేర్లన్నీ నీటిబుడగలేనని… ఎప్పుడైనా పేలిపోవచ్చునని అంటున్నారు. మార్కెట్ పై అవగాహనా ఉన్న అందరికీ ఈ విషయం తెలుసు. కాని కేంద్రంలోని బీజేపీ సర్కార్ అదానీకి సపోర్ట్ గా ఉండటంతో ఆయనకొచ్చిన ముప్పేమీ లేదనుకున్నారు. కానీ హిండెన్‌బర్గ్ బయటపెట్టిన నివేదికతో పరిస్థితి తలకిందులు అవుతోంది.
హిండెన్‌బర్గ్ సంస్థ బయటపెట్టిన రిపోర్ట్ అబద్దమని చెప్పే ధైర్యం అదానీ గ్రూప్ చేయడం లేదు. ఎందుకంటే.. ఆ సంస్థపై ఎదురుదాడి చేస్తే మరిన్ని వివరాలను బయటపెడుతుందని భయం. అందుకే ఆ ప్రచారాన్ని ఖండిస్తోంది తప్ప.. నిజాలెంటో చెప్పడం లేదు. తాము చెప్పింది అవాస్తమని అనుకుంటే లీగల్ గా ఎదుర్కొండని హిండెన్‌బర్గ్ స్పష్టంగా వెల్లడించాక కూడా అదానీ గ్రూప్ న్యాయపోరాటానికి కూడా సిద్దపడటం లేదు.
అదానీ కంపెనీ గురించి అందరికీ తెలిసిందే. గతంలోనూ టాక్స్ హెవెన్ కంట్రీస్ నుంచి ఎలాంటి లెక్కా పత్రం లేకుండా వేల కోట్లు తెచ్చినట్లుగా తేలింది. ఆ కేసు అతీగతీ లేకుండా పోయింది. పుసుక్కున అదానీ గ్రూప్ వలన ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలితే ఇండియాకు కష్టమే. ఇప్పటికే ఎల్ఐసీ సొమ్ము 16వేల కోట్లు హరించుకుపోయిందని అంటున్నారు. అదానీ షేర్లను తనఖా పెట్టుకున్న బ్యాంకులు మరింత నష్టపోతాయి,.
ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుంది. ఆ సంస్థ మునిగిపోతే…నష్టపోయేది మాత్రం అదానీ మాత్రమే..కాదు యావత్ దేశం కూడా. ఎందుకంటే దేశ ప్రజల సంపదతోనే అదానీ వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి..!