వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు హాజరు కావాలని మూడోసారి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటిసులు ఇచ్చింది. సోమవారం విచారణకు రావాలని ఆదేశించింది. కానీ అవినాష్ రెడ్డి తను ముందుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయని సీబీఐకి చెప్పడంతో చివరి నిమిషంలో సీబీఐ కూడా కరుణించింది. పదో తేదీన విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి గడువు ఇచ్చారు. ఈ విషయాన్ని అవినాష్ రెడ్డి స్వయంగా ప్రకటించారు.
వివేకా హత్యకేసు విచారణలో ఈ నెల 10వ తేదీన సీబీఐ ముందు విచారణకు హాజరు అవుతానని వెంపల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అవినాష్ రెడ్డి ప్రకటించారు. 12వ తేదీన తన తండ్రి భాస్కర్ రెడ్డి కడపలో విచారణకు హాజరు అవుతారని వెల్లడించారు. మొదట సోమావారం విచారణకు హాజరు కావాల్సిందేనని సీబీఐ అవినాష్ రెడ్డిని ఆదేశించింది. దీంతో ఆయన తనకు పనులు ఉన్నాయని వంకలు చెప్పడంతో.. విచారణకు అవినాష్ రెడ్డి సహకరించడం లేదని ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ సీబీఐ అధికారులు ఆ దిశగా ఆలోచించడం లేదు.
ఈ కేసు సీబీఐ హ్యండోవర్ లోకి వచ్చి రెండేళ్ళు అవుతోంది. ఇప్పటికీ ఇంకా విచారణ జరుగుతోంది. దీంతో పలు అనుమానాలు వస్తున్నాయి. సున్నితమైన కేసు కావడంతో రాజకీయ ఒత్తిళ్ళు సీబీఐపై ఉన్నాయి. దాంతో ఈ కేసును సీబీఐ స్మూత్ గా డీల్ చేస్తోంది. హడావిడిగా అరెస్టులు చేస్తే కేసు తప్పుదోవ పడుతుందని.. చాలా పకడ్బందీగా కేసును డీల్ చేస్తున్నారు. అందుకే అవినాష్ రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టడంపైనే సీబీఐ ఫోకస్ చేస్తుందని.. మూడోసారి విచారణ అనంతరం ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వైసీపీకి ఎన్నికల సంఘం షాక్