న్యూ ఢిల్లీ లిక్కర్ స్కాం రోజు రోజుకో కిక్కు ఇస్తోంది. అది మాములు కిక్ కాదు. ఫుల్ బాటిల్ ఒకే పెగ్గులో తాగితే ఎంత కిక్ ఇస్తుందో ఇప్పుడు అంతే జర్క్ ఇచ్చింది. ఎంఎల్సి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఈ నెల 8న సిబిఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ రౌస్ అవెన్యు కోర్ట్ లో హర్జరుపరచగా ఆయనకు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విదించిన విషయం తెలిసిందే. ఇతనిని విచారించేందుకు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడి)కి సిబిఐ స్పెషల్ కోర్ట్ అనుమతి ఇచ్చింది. దీనితో తీగ లాగితే దొంక కదులుతుంది అని దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
నిజమే. కానీ, సామాన్యంగా ఇలాంటి కేసులు అనేక మలుపులు తిరిగి చివరికి బకరాగాల్లే బలవుతారు. లోగడ ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మీ కీలకపాత్ర పోషించింది అని నమ్మిన సిబిఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను కోర్ట్ రిమైండ్ ఖైదీగా జైలులు పంపిన విషయం తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది అని అందరు భావించారు. కానీ ఆమె కోర్ట్ లో నోరు విప్పలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
ఈ కేసుకుడా అలాగే మారవచ్చు అని రాజకీయ పండితులు భావిస్తున్నారు. సామాన్యంగా రాజకీయనాయకుల పిఏలు, ఆడిటర్లు, కార్ డ్రైవర్లు, పని మనుషులు వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటారు. నమ్మిన బంటులకంటే ఎక్కేవా. డబ్బు ఆశకో, బెదిరింపుల భయానికో, స్వామి భక్తికో లొంగిపోయి ఆ నేరాలను తమ నెత్తిన వేసుకుంటారు. కావాలని కోర్టులో అప్రూవల్ గా మారుతారు, అసలు సూత్రధారులను తప్పిస్తారు. కానీ వీటికి లొంగకుండా నిజం కక్కితే మాత్రం అసలు సూత్రధారులు బయటికి వస్తారు. మరి గోరంట్ల బుచ్చిబాబు ఏం చేస్తాడో చూడాలి.