ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి రెడ్డిపై కేసు నమోదైంది. కడప జిల్లాకు చెందిన కొర్రు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున తాను ఇచ్చిన ప్రకటన ప్రచురించలేదని.. దీంతో తమ కుటుంబం మనోవ్యధకు గురైనట్లు భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. తాను ఇచ్చిన ప్రకటనలో వైఎస్ షర్మిల ఫోటో ఉండటంతోనే ప్రకటనను పక్కనపెట్టేశారని ఆరోపించారు.
కొర్రు భాస్కర్ రెడ్డి వైఎస్సార్ వీరాభిమాని. వైఎస్ కు సన్నిహితుడు. వైఎస్ ఫ్యామిలీతో భాస్కర్ రెడ్డికి మొదటి నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే వైఎస్సార్ బతికున్న సమయంలో షర్మిలను సొంత చెల్లిలాగా చూసుకోవాలని భాస్కర్ రెడ్డికి చెప్పేవారని అంటుంటారు. ఆ అభిమానంతో వైఎస్ జయంతి రోజున జగన్ సొంత పత్రికకు ప్రకటనలు ఇస్తుంటారు భాస్కర్ రెడ్డి. ప్రతిసారి ఆయన ఇచ్చిన ప్రకటన ప్రచురితం అవుతూనే ఉంది. కానీ ఈసారి మాత్రం ఆ ప్రకటన ప్రచురించలేదు. ఈ విషయమై కొర్రు భాస్కర్ రెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కోర్టులో ఆఫిడవిట్ కూడా దాఖలు చేశారు. జూలై ఎనిమిదో తేదీన తాను ఇచ్చిన ప్రకటన వేయలేదని..ఆ ప్రకటనలో షర్మిల ఫోటో ఉండటంతోనే ప్రకటన ప్రచురించలేదని పేర్కొన్నారు. దీనిపై సాక్షి చైర్మన్ భారతి రెడ్డితోపాటు మరో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు.
ఐపీసి సెక్షన్స్ 420, 500, 120B,34 కింద చర్యలు తీసుకోవాలంటూ భాస్కర్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైఎస్ షర్మిల ఫోటో ఉన్నందునే తన ప్రకటనను ప్రచురించలేదని.. ఇదంతా భారతి రెడ్డి ఆదేశాలతో జరిగిందని సాక్షి పత్రిక యాడ్స్ మేనేజింగ్ డిపార్ట్ మెంట్ తనకు చెప్పినట్లు భాస్కర్ రెడ్డి తన ఫిర్యాదులో ప్రస్తావించారు. వైఎస్ జయంతి రోజున తమ యాడ్ రాకపోవడం వలన తమ కుటుంబం తీవ్ర నిరాశ చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకటనలో షర్మిల ఫోటో వేయాలని కోరడం తన హక్కని , ఆమె ఫోటో ప్రచురించడంపై నిషేమేమి లేదని ఆయన అన్నారు.
వైఎస్ జయంతి రోజున సాక్షి పత్రిక వందలాది యాడ్స్ ను ప్రచురిస్తుంది. షర్మిల ఫోటోతో కూడిన ప్రకటనను భాస్కర్ రెడ్డి ఇవ్వడంతోనే ఈ ప్రకటనను పక్కనబెట్టేశారని తాజాగా రుజువు అవుతోంది. ఎన్ని విబేధాలు ఉన్నా అవి కుటుంబం లోపలే చర్చించుకోవాలి. ఇలాంటి అంశాల్లో చూసి చూడనట్టు వదిలేయాలి. కానీ ఓ యాడ్ లో ఆడపడుచు ఫోటో ఉందని దానిని ఆ యాడ్ నే ప్రచురించివద్దని భారతి రెడ్డి ఆదేశించడంతో ఫ్యామిలీలో అంతర్యుద్దం తీవ్రస్థాయిలో జరుగుతుందని.. ఇది మరికొద్ది రోజుల్లో ముదిరి పాకన పడి రోడ్డు ఎక్కే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
షర్మిల పేరు వింటేనే భారతి రెడ్డి సహించలేకపోతున్నారని వైఎస్ కుటుంబీకుల్లోనే అంతర్గత చర్చ జరుగుతోంది. ఆస్తితోపాటు రాజకీయవారసత్వంలోనూ షర్మిలకు వాటా దక్కకుండా వైఎస్ భారతి రెడ్డి తెరవెనక చక్రం తిప్పుతున్నారన్న ప్రచారం జరుగుతుండగా..ఈ విషయం బయటకు రావడంతో అంత నిజమేనని అనుకుంటున్నారు.
Also Read : వచ్చే ఎన్నికల్లో జగన్ భార్య భారతి పోటీ – ఎక్కడి నుంచంటే..?