టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఏఈ , టౌన్ ప్లానింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలే కాదు. ఈ పేపర్ లీకేజీలో కీలక నిందితుడిగానున్న టీఎస్ పీస్సీ ఉద్యోగి ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమ్స్ రాశాడు. ఇందులో అతనికి 103మార్కులు రావడంతో గ్రూప్ 1 పరీక్ష పేపర్ కూడా లీక్ అయి ఉంటుందని ప్రతిపక్షాలు, విద్యార్ధి సంఘాలు ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
ఈ లీకేజీపై విచారణ చేసిన సిట్ గ్రూప్ 1కూడా పేపర్ కూడా లీక్ అయినట్లు తేల్చింది.దీంతో ఈ గ్రూప్ 1ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్ పీస్సీ ప్రకటించింది. దీంతోపాటు ఏఈఈ ,డీఏవో పరీక్షలను సైతం రద్దు చేసింది. అక్టోబర్ 16న 503పోస్టులకు గ్రూప్ 1ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. 3. 80లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 2.86లక్షల మంది ఈ పరీక్షను రాశారు. ఇందులో 1 :50నిష్పత్తిలో 25,150మంది మెయిన్స్ ను ఎంపిక అయ్యారు.
గ్రూప్ 1ప్రిలిమ్స్ ను మళ్ళీ జూన్ 11న నిర్వహించనున్నట్లు టీఎస్ పీస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవే కాకుండా త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు సంచారం. ఇక, రద్దైన ఏఈఈ, డీఏవో పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.
Also Read : టీఎస్ పీస్సీ పేపర్ లీకేజీలోనూ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం..?