సుప్రీంకోర్టు జడ్జి అబ్దుల్ నజీర్. ఆయన రిటైర్ కాగానే గవర్నర్ పదవి కట్టబెట్టింది కేంద్రం. గతంలోనూ సుప్రీంకోర్టు న్యాయవాదులకు ఇదే విధంగా పదవులు కట్టబెట్టడంతో వారిచ్చిన తీర్పులపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. పక్షపాత ధోరణితో వారు కేంద్రానికి అనుకూలంగా తీర్పులను ఇచ్చారా..? అనే సందేహాలను లేవనెత్తేలా ఉంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సదాశివం (2014)ను కేరళ గవర్నర్ గా అపాయింట్ చేసింది కేంద్రం. అప్పట్లో అనేక అభ్యంతరాలు వచ్చాయి. కానీ మోడీ సర్కార్ ఎవరి అభ్యంతరాలను పట్టించుకోలేదు. జస్టిస్ సదాశివం కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన తాను ఈ గవర్నర్ పదవి చేపట్టడం ఎందుకని అనుకోలేదు. పదవిలో కొనసాగారు. అప్పటి నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, జడ్జిలకు పదవులు ఇవ్వడం స్టార్ట్ చేసింది కేంద్రం. ఆ తరువాత సీజేఐ గా చేసిన రంజన్ గోగొయ్ ను రాజ్యసభకు పంపింది. అయోధ్య తీర్పులో ఆయన ఇచ్చిన తీర్పు వలనే ఈ పదవి ఇచ్చారని అప్పట్లో పెద్ద రచ్చె జరిగింది. ఇప్పుడు ఏపీ గవర్నర్ గా నియమించిన అబ్దుల్ నజీర్ విషయంలోనూ అదే రచ్చ , అదే చర్చ కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దును సమర్ధించాడు.
రిటైర్డ్ న్యాయమూర్తులు పదవులు చేపట్టవద్దనేం లేదు. కానీ ఈ పదవుల ఆశ కోసం న్యాయవాది వృత్తిలలో కొనసాగుతున్న సమయంలో పక్షపాత తీర్పులు ఇవ్వలేదని చెప్పగలమా..? ఇప్పుడు అవే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. పదవుల కోసమే కేంద్రానికి అనుకూల తీర్పులు ఇచ్చి ఉండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రానికి వ్యతిరేక తీర్పులు ఇస్తే పదవులు కట్టబెట్టినా అభ్యంతరం లేదని కాదు. ఒకరెనుక ఒకరికి ముఖ్యంగా కేంద్రానికి కీలక అంశాల్లో అనుకూలమైన తీర్పులు ఇచ్చిన వారికీ మాత్రమే పదవులు కట్టబెట్టడం ఈ తరహ ప్రశ్నలకు ఆస్కారం కల్పించకుండా ఎలా ఉంటుంది..?
దేశంలో న్యాయవ్యవస్థపై విశ్వసనీయత ఉంది. దానిని ఆ వ్యవస్థలోనున్న వారే కాపాడాలి. కానీ ఇలాంటి వాటి వలన జనాల్లోకి తప్పుడు సందేశం వెళ్తుంది. న్యాయవ్యవస్థపై కూడా నమ్మకం సన్నగిల్లుతుంది. కేంద్రం అందుకు ఆస్కారం కల్పించేలా నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం సబబు కాదు.