కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా శ్రమిస్తోన్న టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కుట్రలు మొదలు పెట్టింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ కన్వీనర్ కొణతం దిలీప్, మన్నె క్రిశాంక్ లు రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ప్రత్యేక వీడియోలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ ను దెబ్బకొడితే కాంగ్రెస్ ను దాదాపు అధఃపాతాళానికి తోక్కేసినట్లేనని ప్లాన్ తో ఈ వీడియోలను సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డితోపాటు క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న, మన తొలివెలుగు రఘు , కాళోజీ టీవీపైన భయంకరమైన కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రేవంత్ తోపాటు కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా 3, 500 నకిలీ వీడియోలను ఇప్పటికే తయారు చేసినట్లుగా సమాచారం. మరో వెయ్యి వీడియోలు తీన్మార్ మల్లన్న, మన తొలివెలుగు రఘు, కాళోజి టీవీ నిర్వాహకులపై రూపొందించినట్లు తెలుస్తోంది. గతంలో సోనియా గాంధీని రేవంత్ విమర్శించిన వీడియోలను తాజాగా తెరపైకి తీసుకురావడంతోపాటు, కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు రేవంత్ వ్యతిరేకంగా మాట్లాడినట్లు మిమిక్రీ ఆర్టిస్టులతో వాయిస్ చేయించి పార్టీలో గందరగోళం సృష్టించే పనిలో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం నిమగ్నమైనట్లు చెబుతున్నారు. తద్వారా కాంగ్రెస్ లో ఓ కల్లోలం సృష్టించేలా పక్కా ప్లాన్ ను రెడీ చేసి ఉంచారని అంటున్నారు. అలాగే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కేసీఆర్ తోపాటు కిషన్ రెడ్డితో టచ్ లోకి వెళ్ళారని అబద్దపు ఆడియోలతో జనాలను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారని అంటున్నారు.
ఇదిలా ఉండగా..రేవంత్ అమెరికా పర్యటనలో 24గంటల కరెంట్ పై మాట్లాడుతూ..బీఆర్ఎస్ విద్యుత్ కొనుగోళ్ళ అంశాన్ని ప్రస్తావించాడు. రైతులకు బీఆర్ఎస్ మూడు గంటల కరెంట్ ఇస్తూ..తప్పుడు లెక్కలతో విద్యుత్ స్కామ్ చేసిందని ఆరోపించారు.తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారని వారు మూడు గంటలే ఎక్కువగా వినియోగించుకుంటారని రేవంత్ తెలిపారు. ఈ వీడియోను పూర్తిగా ఎడిట్ చేసి.. రేవంత్ మూడు గంటల కరెంటే ఇవ్వాలని అన్నట్లు నకిలీ వీడియోను రూపొందించి బీఆర్ఎస్ అనుకూల ఛానెల్స్ లో ప్లే చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో రేవంత్ లక్ష్యంగా గతంలో ఆయన మాట్లాడిన వీడియోలను ఎడిట్ చేసి కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు కోసం తెలంగాణలో రేవంత్ పని చేస్తున్నాడు అనేలా మిమిక్రీ ఆర్టిస్టులను హైర్ చేసుకొని నకిలీ వీడియోలను ఎన్నికల సమయంలో పబ్లిక్ లోకి వదలాలని కుట్రలు చేస్తున్నట్లుగా మల్లన్న పసిగట్టారు.
ఇక, తీన్మార్ మల్లన్న సోమన్న బీఆర్ఎస్ లో చేరికను సమర్ధించడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారని ఆడియోలను రూపొందిస్తున్నారట. మన తోలివెలుగు రఘు బీఆర్ఎస్ నేతలను బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా ఆడియోలను సృస్టించనున్నారని మల్లన్న టీమ్ పక్కగా చెబుతోంది.
Also Read : కాంగ్రెస్సే బీఆర్ఎస్ ను ఓడిస్తుందని బీజేపీ నేతలు చెప్తున్నారా..?