తెలంగాణలో ఏం నడుస్తుండంటే…జనాల నోటి నుంచి వినిపిస్తున్న మాట ఏంటో తెలుసా? ప్రజా ప్రభుత్వం పెట్టుబడుల వేటలో ఉంటే..ప్రతిపక్షం మాత్రం అబద్దాలను ప్రచారం చేసే పనిలో బిజీ అయిపోయిందని చర్చించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. రాష్ట్రంలో అవకాశాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో ఆయనపై నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి.
సింగపూర్‌కు చెందిన పలు కంపెనీలు రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమల్లో ఇన్వెస్టిమెంట్ చేయనున్నారు. రాబోయే రోజుల్లో వేల కోట్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టనున్నారు. సీఎం వెళ్లి స్వయంగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులు వివరించి..పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇస్తే ఎవరు కాదంటారు. గతంలో అమెరికా పర్యటనలోనూ పెట్టుబడుల కోసం అనేక సమావేశాలు నిర్వహించారు రేవంత్‌రెడ్డి. ఆయన కృషితో పలు రంగాల్లో 31వేల 532 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 30వేల నూతన ఉద్యోగాలు రానున్నాయి.
ఇక రేవంత్‌రెడ్డి ప్రజలు తనకిచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తుంటే…ఆయన విదేశీ పర్యటన జనాల్లోకి వెళ్లకుండా పింక్ సోషల్ మీడియాకి ట్విట్టర్ టిల్లు ఇచిన టాస్క్ ఏంటో చూడండి. వాళ్లంతా గోబెల్స్‌ను మించి విష ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా గాలి వార్తలు సృష్టించి జనాలను నమ్మించేందుకు నానా తంటాలు పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆప్తులపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. వసూళ్లు చేస్తున్నారంటూ గాలి వార్తలను వండివార్చుతున్నారు. అంతేకాదు కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడిన రేవంత్ రెడ్డిపై కూడా కుటుంబ రాజకీయం అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మీడియాతో చిట్ చాట్‌లో కేటీఆర్…సోషల్ మీడియాలో పింకీలు తప్పుడు కూతలు కూస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్నదమ్ములతో పాటూ ఆయన వెన్నంటి ఉండే ఆప్తులకు అవినీతి మరకలు అంటించేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిజానికి రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన అన్నదమ్ములు రాజకీయాల్లోకి రాలేదు. రేవంత్ రాజకీయంగా ఎదుగుతున్న సమయం నుంచే ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలు, పేదల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ..వాటిని పరిష్కరిస్తున్నారు తిరుపతి రెడ్డి. ఇక రోహిణ్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డిలు రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనకు దగ్గరయినవారు కాదు. రాజకీయాల్లో చాలా కాలంగా ఆయనతో కలిసి నడుస్తున్న వ్యక్తులు. వీరితో పాటూ జర్నలిస్ట్ నరసింహారెడ్డి నిజాయితీగా గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపిన వ్యక్తి. ఆయన్ను కేటీఆర్ బ్యాచ్ ఎంత ఇబ్బంది పెట్టిందో ప్రజలకు తెలుసు. అయినా కర్తవ్యాన్ని మరువకుండా ప్రజలకు నిజాలను చూపించారు.
గతంలో పదేళ్ల పాటూ అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్ నేతలు..ఎవరైనా హైదరాబాద్ వస్తే వారిని కలిసి ఫోటోలు దిగడం తప్పితే పెట్టుబడి అవకాశాలను వివరించిన పాపాన పోలేదు. నాటి సీఎం కేసీఆర్ అయితే ఎన్నడూ ఫామ్ హౌజ్ దాటి పెట్టుబడుల కోసం ఎవరినీ కలువలేదు.