బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యాలయాన్ని కేసీఆర్ బుధవారం ఢిల్లీలో ప్రారంభిస్తున్నారు. అది అద్దేది. సొంత బిల్డింగ్ మరోచోట నిర్మిస్తున్నారు. అది అందుబాటులోకి రావాలంటే మరో నాలుగైదు నెలల సమయం పడుతుంది. ముహూర్తం ఇప్పుడే బాగుందని అద్దె భవనం తీసుకొని కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు కేసీఆర్. ఈ కార్యక్రమానికి రావాలని రైతు సంఘాల నేతలకు, తనతో టచ్ లోనున్న వివిధ పార్టీల నాయకులకు కేసీఆర్ ఆహ్వానం పంపారు. అయితే, కేసీఆర్ ఆహ్వానం అందుకున్న వారంతా హాజరు అవుతారా అన్నది క్లారిటీ లేదు.
తెలంగాణ నుంచి మాత్రం మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆరెఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి భారీగా వెళ్లారు. ఇదంతా బాగానే ఉన్నా, జాతీయ స్థాయిలో చక్రం తిప్పనున్నాం. ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ నినాదాలు ఇస్తున్న కేసీఆర్, జాతీయ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు రాకుంటే అది తెలంగాణ పార్టీ ఆఫీసుగానే ఉండిపోతోంది. జాతీయ పార్టీగా అసలే అనిపించదు. బీఆర్ఎస్ లో చేరాలనుకున్న నేతలు, పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనుకున్న నేతలైనా వస్తారా..?అన్నది కూడా స్పష్టత లేదు.
బీఆరెస్ పై కేసీఆర్ ఎం చేసిన కర్ణాటక నేత కుమారస్వామి, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వెంటే ఉంటున్నారు.కాబట్టి, బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వారొచ్చినా అంత హైప్ ఏమి ఉండదు. జాతీయ స్థాయి నేతలు ఈ కార్యక్రమంలో కనిపిస్తేనే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ఇంపాక్ట్ చూపిస్తుంది లేదంటే.. తెలంగాణకు చెందిన పార్టీగానే ముద్ర పడిపోతుంది.