టీఆర్ఎస్ ను జాతీయస్థాయి పార్టీగా మార్చేందుకు బీఆర్ఎస్ చేశారు. ఆ పార్టీకి జాతీయ స్థాయిలో హైప్ తీసుకొచ్చేందుకు పెద్దగా ప్రయత్నాలు జరగడం లేదు. గతంలో ఢిల్లీలో సభను నిర్వహించి.. పార్టీ విధి విధానాలు ప్రకటిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. కాని ఢిల్లీలో సభ పెట్టలేదు. ఆ తరువాత ప్రెస్ మీట్ అన్నారు. ఆ మీడియా సమావేశం కూడా నిర్వహించలేదు.
తాజాగా కేసీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. ఖమ్మంలో ఈ నెల 18బ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్టీ పేరు మార్చాక నిర్వహిస్తోన్న మొదటి సభ ఇదే కావడంతో.. దీనినే బీఆర్ఎస్ ఆవిర్భావ సభగా ప్రకటించారు. ఈ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఇద్దరు ఆప్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్ తోపాటు కేరళ సీఎం విజయన్ ను ఆహ్వానించారు. ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో, టీఆర్ఎస్ బలోపేతానికి ఆ పార్టీ బహిరంగ సభలనే ఎక్కువ నమ్ముకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ను దేశవ్యాప్తం చేసేందుకు కూడా ఇదే విధానం అనుసరించాలని ప్లాన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ద్వారా దేశ రైతాంగానికి కేసీఆర్ స్పష్టమైన సందేశం ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ కు హైప్ తీసుకొచ్చేందుకు ఢిల్లీలో సభ నిర్వహిస్తేనే పార్టీ ఎక్కువ జనాల్లోకి వెళ్తుంది. కాని తెలంగాణలో నిర్వహించడం వలన అది రాష్ట్రానికే పరిమితం అవుతుంది. పైగా.. తెలుగు మాట్లాడే వారు మాత్రమే ఈ సభను పట్టించుకుంటారు కాని ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఈ సభను లైట్ తీసుకుంటారన్నది చెప్పక్కర్లేదు.
బీఆర్ఎస్ ఏర్పాటుతో తమతో చాలామంది నేతలు కలిసి వస్తారని కేసీఆర్ ప్రకటించారు. కాని ఒకరిద్దరు నేతలు మినహా కేసీఆర్ తో ఎవరూ జట్టుకట్టేందుకు సుముఖత కనబరచడం లేదు. ఇక,ఆప్ కూడా అడపాదడప బీఆర్ఎస్ కు మద్దతు తెలపడానికి కారణం ఉందట. పంజాబ్ ఎన్నికల్లో కేసీఆర్ ఆర్ధిక సాయం చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు మద్దతుగా ఆప్ వ్యవహరిస్తోందని అంటున్నారు.
Also Read : బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య అండర్ స్టాండింగ్ కుదిరిందా..?