బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఫ్యామిలీకు బీఆర్ఎస్ సర్కార్ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ను కాదని నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో రేఖా నాయక్ ఫ్యామిలీకి ఇచ్చిన ఝలక్ తో అసంతృప్తులకు బీఆర్ఎస్ బాస్ ఓ వార్నింగ్ ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది.
ఉదయం ఓ ఛానెల్ లో మాట్లాడుతూ రేఖా నాయక్ తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత కొన్ని గంటలకే రేఖా నాయక్ అల్లుడు శరత్ చంద్ర పవార్ ను తెలంగాణ స్టేట్ పోలిస్ అకాడమికి ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం మహబూబాబాద్ ఎస్పీగా పని చేస్తోన్న ఆయన్ని బదిలీ చేసి రేఖా నాయక్ ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది. శరత్ చంద్ర స్థానంలో మహబూబాబాద్ ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ ను అపాయింట్ చేసింది.
ప్రభుత్వ వైఖరి చూస్తుంటే అత్తమీద కోపం అల్లుడి మీద చూపించినట్లు ఉందని అంటున్నారు. రేఖా నాయక్ పై కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ నిర్ణయం సర్కార్ తీసుకుందని ఆరోపిస్తున్నారు. ఏదీ ఏమైనా ఆమె పార్టీ మార్పు ప్రకటన కొన్ని గంటలకే ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది.
Also Read : తుమ్మలకు బీఆర్ఎస్ బంపర్ ఆఫర్ – కాంగ్రెస్ లో చేరికపై వెనక్కి తగ్గుతాడా.?