తుమ్మల నాగేశ్వర్ రావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ బాస్ అలర్ట్ అయ్యారు. తుమ్మలను కాంగ్రెస్ లోకి వెళ్ళకుండా నిలువరించే బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడటంతో పార్టీ క్యాడర్ కొంత దూరమైంది. ఇప్పుడు ఆ జిల్లాలో బలమైన నేతగానున్న తుమ్మల కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తే జిల్లాలో పార్టీ బలహీన పడుతుందని.. అది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని కేసీఆర్ ఆందోళన.
అందుకే తుమ్మలను బీఆర్ఎస్ లోనే కొనసాగేలా చూడాలని హరీష్ రావుకు బాధ్యతలు కట్టబెట్టారు. రాజ్యసభ సీటు ఇస్తామని.. అలాగే ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలను పూర్తిగా నీ చేతుల్లోనే ఉంచుతామని తుమ్మలకు మనస్సు దోచేలా హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడిగా కేకే కు మరోసారి పొడగింపు ఉండదని.. ఆయన స్థానంలో నీకు పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, గతంలోనూ ఇలాంటి హామీలనే ఇచ్చి పక్కన పెట్టేసిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం ఎన్నికల వరకు ప్రాధాన్యతనిచ్చి తరువాత పక్కన పెట్టాడని గ్యారెంటి ఏంటనేది తుమ్మల ఇన్నర్ ఫీలింగ్.
కాంగ్రెస్ లో చేరితే పాలేరు టికెట్ దక్కే అవకాశం ఉంది. పైగా జిల్లాలో బీఆర్ఎస్ యాక్టివ్ గా లేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆయన అనుచరవర్గం ఆసక్తిగా గమనిస్తోంది. అనుచరులు మాత్రం కాంగ్రెస్ లో చేరాలని తుమ్మలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడేమో సర్కార్ నుంచి రాజ్యసభ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు ఎం చేయాలనీ తుమ్మల మధనపడుతున్నారు. చూడాలి మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..
Also Read :కాంగ్రెస్ లో చేరేందుకు ఆ నేతలంతా ఆసక్తి ..?